భారతీయునికే ట్విట్టర్ పట్టం.. సీఈవోగా పరాగ్ అగర్వాల్
Parag Agarwal | మొన్న మైక్రోసాఫ్ట్.. నిన్న గూగుల్.. నేడు ట్విట్టర్. గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాలు వరుసగా భారతీయుల సారథ్యంలోకి వస్తున్నాయి. ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ పగ్గాలు భారత సంతతి టెక్కీ చేతికి

న్యూయార్క్, నవంబర్ 29: మొన్న మైక్రోసాఫ్ట్.. నిన్న గూగుల్.. నేడు ట్విట్టర్. గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాలు వరుసగా భారతీయుల సారథ్యంలోకి వస్తున్నాయి. ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ పగ్గాలు భారత సంతతి టెక్కీ చేతికి వచ్చాయి. ట్విట్టర్ కొత్త సీఈవోగా పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. సీఈవోగా ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సోమవారం దిగిపోవడంతో ఆయన స్థానంలో చీఫ్ టెక్నికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పరాగ్ అగర్వాల్‌ను సంస్థ బోర్డు ఏకగ్రీవంగా ఎన్నుకున్నది. 2006లో మరో ముగ్గురితో కలిసి డోర్సే ట్విటర్‌ను స్థాపించిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి ఇప్పటిదాకా ట్విట్టర్ సారథిగా డోర్సేనే కొనసాగుతున్నారు. దాదాపు 16 ఏండ్ల అనంతరం సంస్థకు కొత్త సీఈవో రాగా, అదికూడా ఓ భారతీయుడికి అవకాశం లభించడం గమనార్హం. కాగా, 2022లో జరిగే సంస్థ వాటాదారుల సమావేశం వరకు డోర్సే ట్విట్టర్ బోర్డులో సభ్యుడిగా కొనసాగనున్నారు.
ఎవరీ పరాగ్ అగర్వాల్?
ఐఐటీ బాంబే, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి అయిన పరాగ్ అగర్వాల్.. పదేండ్ల క్రితం ట్విట్టర్లో యాడ్స్ ఇంజినీర్‌గా చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2017లో సంస్థ టెక్నాలజీ అధిపతిగా పదోన్నతి పొందారు. ఇప్పుడు సీఈవోగా ఎన్నికయ్యారు. గతంలో మైక్రోసాఫ్ట్, యాహూ తదితర సంస్థల్లోనూ పనిచేశారు. ‘ఈ బాధ్యత నాకు రావడంపట్ల గర్వపడుతున్నాను. డోర్సే మార్గదర్శకత్వాన్ని కొనసాగిస్తాను. ఆయన స్నేహానికి కృతజ్ఞతలు’ అని ఈ సందర్భంగా పరాగ్ అన్నారు.
పరాగ్ సమర్థుడు: డోర్సే
‘సహ వ్యవస్థాపకుడిగా ట్విట్టర్‌తో మొదలైన నా ప్రయాణం సుమారు 16 ఏండ్లుగా కొనసాగింది. ఇప్పుడిక సంస్థను వీడాలని నిర్ణయించుకున్నా. పరాగ్‌పై నాకు పూర్తి నమ్మకం ఉన్నది. అతని నైపుణ్యం, ప్రతిభ సంస్థను మరింత ఎత్తుకు తీసుకెళ్లగలవు. ఐ లవ్ ట్విట్టర్’ అని డోర్సే ట్వీట్ చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

