ఇది ఊచకోతే : జెలెన్స్కీ
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా ఊచకోతకు పాల్పడుతున్నట్లు ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. యావత్ దేశాన్ని చిత్రహింసకు గురిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఓ మీడియాతో మాట్లాడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు .. రష్యా బెదిరింపులకు లొంగిపోయేది లేదన్నారు. అందుకే తమను ధ్వంసం చేసి, సర్వనాశనం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. రష్యా ఊచకోతకు పాల్పడుతుందా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. అవును, ఇది ఊచకోతే అని, యావత్ దేశాన్ని ధ్వంసం చేస్తున్నారని, ప్రజల్ని చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. మేం ఉక్రెయిన్ పౌరులమని, మాకు వంద రకాల జాతీయ భావాలున్నాయని, వాటిని రష్యా సర్వనాశనం చేస్తున్నట్లు జెలెన్స్కీ ఆరోపించారు. ఆదివారం రాత్రి కూడా ఆయన దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. మన నేలను టార్గెట్ చేస్తూ ఓ దెయ్యం మనపై దాడి చేస్తోందని, ఈ దేశాన్ని ఆక్రమిస్తూ నేరాలకు పాల్పడుతున్న ఆ దేశాన్ని అన్ని రకాల విచారణ చేపడుతామన్నారు. ఆక్రమణతో నేరాలకు పాల్పడుతున్న ప్రతి ఒక్కర్నీ దండిస్తామన్నారు.
64వ గ్రామీ అవార్డు ప్రదానోత్సవ సమయంలో జెలెన్స్కీ సందేశాన్ని ప్లే చేశారు. బాంబుల వర్షంతో ఉక్రెయిన్ వీధుల్ని రష్యా నిర్మానుషంగా మారుస్తోందని, మీ పాటలతో ఆ సైలెన్స్ బ్రేక్ చేయాలని జెలెన్స్కీ తన సందేశంలో కోరారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

