అదో నీచమైన హాస్యం.. ఇమ్రాన్‌పై ఫైర్ అయిన పాక్ ప్రధాని
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ముస్లీంలీగ్ ఎన్ నేత మరియం నవాజ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ పార్టీ నేతలతో సహా ఇతర పాక్ ప్రముఖులు ఇమ్రాన్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. ముల్తాన్‌లో జరిగిన ఓ ర్యాలీలో ఇమ్రాన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మరియమ్ నవాజ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
తన ఉపన్యాసంలో చాలా సార్లు ఆమె నా పేరును ఉచ్చరించారు. ఆమెతో ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా. మరియమ్… జాగ్రత్తగా ఉండండి. మీ భర్త చాలా హైరానా పడుతుంటారు. ఎందుకంటే మీరు మీ ఉపన్యాసంలో చాలా సార్లు నా పేరును ఉచ్చరించారు అంటూ ఇమ్రాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తీవ్రంగా మండిపడ్డ ప్రధాని షెహబాజ్ షరీఫ్
ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని షెహబాజ్ షరీఫ్ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా విరుచుకుపడ్డారు. మహిళల విషయంలో ఇమ్రాన్ చాలా ఇబ్బందులు కలిగే భాసను వాడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. మీరు చేసిన వ్యాఖ్యలు నీచమైన హాస్యం కిందికి వస్తాయి. పీబీయూహెచ్ సిద్ధాంతాలను పాటించని వారు మహిళలను గౌరవిస్తామని ఎలా భావిస్తాం. ఇలా నీచమైన హాస్యం మాట్లాడుతూ అధఃపాతాళంలోకి పడిపోయిన మొదటి నేత ఇమ్రానే. ప్రజల నైతికతను కూడా చెడగొట్టారని పాక్ ప్రధాని విరుచుకుపడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

