Guinness world record: ఒక్కరోజులో 78 పబ్‌లకు వెళ్లి గిన్నిస్ రికార్డు సాధించిన ఆస్ట్రేలియా వ్యక్తి
ఒక్కరోజులో ఎక్కువ పబ్‌లు చుట్టొచ్చి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన హెన్రిచ్ డి విల్లియర్స్
గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాలని ఒక్కొక్కరు ఒక్కోలా ప్రయత్నిస్తారు. ఆస్ట్రేలియాకు చెందిన హెన్రిచ్ డి విల్లియర్స్ ఒక్క రోజులో ఎక్కువ పబ్‌లను చుట్టేసిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించాలి అనుకున్నాడు. అనుకున్నట్టుగానే ఈ ఏడాది గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు. ఇతను 24 గంటల్లో మెల్బోర్న్లోని 78 పబ్‌లకు వెళ్లొచ్చాడు.
హెన్రిచ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మెల్బోర్న్, విక్టోరియా నగరాల్లోని పబ్‌లు, బార్లకు వెళ్లాడు. వెళ్లిన చోటల్లా కొంచెం మద్యం రుచి చూశాడు. ఇతను పబ్‌ల వెంట తిరగడం వెనక ఓ కారణం ఉంది. కరోనా కాలంలో మెల్బోర్న్ సిటీలోని పబ్‌లు, బార్లు గిరాకీ లేకపోవడంతో వెలవెలబోయాయి. దాంతో స్థానిక పబ్‌లకు జనాన్నిరప్పించేందుకు, ఎక్కువ మందికి తెలియని పబ్‌లు, బార్ల గురించి తెలియజేసేందుకు హెన్రిచ్ ఈ ఛాలెంజ్ స్వీకరించాడు.
‘మెల్బోర్న్లోని బార్లు, పబ్‌ల జాబితా తయారుచేసుకుని, రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకున్నా. పబ్‌లోకి వెళ్లగానే గిన్నిస్ రికార్డ్ గురించి చెప్పేవాన్ని. నియమాల ప్రకారం ప్రతి బార్, పబ్‌లో 125 మిల్లీలీటర్ల మద్యం మాత్రమే తాగాను’ అని హెన్రిచ్ చెప్పాడు. ఇంతకు ముందు ఈ రికార్డ్ ఇంగ్లాండ్‌కి చెందిన నాథన్ క్రింప్ పేరు మీద ఉంది. నాథన్ ఒక్కరోజులో బ్రిఘ్టన్ సిటీలోని 67 పబ్‌లని చుట్టేసి వచ్చాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సీఎం సభకు వెళ్లొస్తుండగా రెండు బస్సుల మధ్య నలిగి మహిళ మృతి.. 5లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేసిన పొన్నం
Dorothy | రొటర్డ్యామ్ ఫిలిం ఫెస్టివల్ ఎంపికైన ‘డోరతీ’.. లైమ్లైట్ విభాగంలో ప్రదర్శన!
టేకులపల్లిలో ఇసుక ట్రాక్టర్ బోల్తా.. యువకుడు మృతి.. గర్భిణి భార్య, కుమార్తెకు తీరని శోకం
Kakatiya University | కాకతీయ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్.. 14 మంది విద్యార్థులకు అస్వస్థత
Rekha Naik | రేఖా నాయక్ ఇళ్లలో ఈడీ సోదాలు.. రూ.40.96 కోట్ల ధాన్యం కుంభకోణం కేసులో తనిఖీలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

