మెటాలో 8 వేల మందిపై వేటు.. మరో 7 వేల మంది ఉద్యోగ విధులు, బాధ్యతల్లో మార్పు
ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా భారీ ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నది. మే 20న సంస్థలోని సుమారు 8 వేల మందికి పైగా ఉద్యోగులను విధుల నుంచి తొలగించనుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 10 శాతంగా అంచనా వేస్తున్నారు.
- స్టాండర్డ్ చార్టెర్డ్ కంపెనీలో 7800 మందికి ఉద్వాసన
వాషింగ్టన్, మే 19 : ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా భారీ ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నది. మే 20న సంస్థలోని సుమారు 8 వేల మందికి పైగా ఉద్యోగులను విధుల నుంచి తొలగించనుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 10 శాతంగా అంచనా వేస్తున్నారు. ఉద్యోగుల తొలగింపుతో పాటు సుమారు 7 వేల మంది ఉద్యోగులను కొత్తగా పునర్ వ్యవస్థీకరించిన కృత్రిమ మేధపై దృష్టి సారించే బృందాల ఏర్పాటుకు తరలించనున్నారు. ప్రస్తుతం 78,000 మందికి కాస్త తక్కువగా ఉన్న మెటా ఉద్యోగుల సంఖ్యలో ఈ మార్పుల ప్రభావానికి గురైన వారి సంఖ్య దాదాపు 20 శాతానికి చేరుకుంది. రాయిటర్స్ వార్తా సంస్థ కథనం ప్రకారం సంస్థలో ఉద్యోగుల తొలగింపుతో పాటు సంస్థ పునర్ నిర్మాణంలో భాగంగా చేపట్టబోయే చర్యలు, ఉద్యోగుల బదిలీ గురించి సోమవారం ఒక అంతర్గత మెమోలో ఉద్యోగులకు తెలియజేసింది. ఈ నెల 20న మూడు వేర్వేరు దశలలో ఈ-మెయిల్స్ ఉదయం 4 గంటలకు వస్తాయని కంపెనీ వర్గాలు తెలిపాయి.
స్టాండర్డ్ చార్టెర్డ్లోనూ..
యూకే ప్రధాన కేంద్రంగా ఉన్న అంతర్జాతీయ బ్యాంక్ స్టాండర్డ్ చార్టెర్డ్ 2030 నాటికి సుమారు 7,800 మంది ఉద్యోగులను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రకటించింది. ఇది మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 15 శాతం. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థకు 82 వేల మంది ఉద్యోగులుండగా, వారిలో 52 వేల మందికి పైగా లక్ష్యంగా చేసుకున్న కార్పొరేట్ విభాగాల్లో ఉన్నారు. ఆసియాపై దృష్టిసారించిన స్టాండర్డ్ చార్టర్డ్, తన బ్యాక్ ఆఫీస్‌ను కుదించుకోవడానికి ఏఐపై ఆధారపడటంతో ఈ ఉద్యోగులను తొలగించనుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం
William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

