శాన్ఫ్రాన్సిస్కో: భారీ స్థాయిలో ఫేస్బుక్ రిక్రూట్మెంట్ చేపట్టనున్నది. రానున్న పదేళ్లలో సుమారు పది వేల మందికి యురోపియన్ యూనియన్ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నది. వర్చువల్ వరల్డ్ మెటావర్స్ నిర్మాణంలో భాగంగా ఈ రిక్రూట్మెంట్ చేపట్టనున్నట్లు ఫేస్బుక్ తన బ్లాగ్‌లో వెల్లడించింది. మెటావర్స్ వర్చువల్ వరల్డ్‌లో డిజిటల్ టెక్నాలజీ సమ్మేళనంగా ఉంటుంది. ఆన్లైన్ గేమ్స్, షాపింగ్, వర్కింగ్ దాని ద్వారా చేసుకోవచ్చు. నిష్ణాతులైన్ ఆన్లైన్ ఇంజినీర్లను రిక్రూట్ చేయనున్నట్లు ఫేస్బుక్ తన బ్లాగ్‌లో చెప్పింది. యురోపియన్ యూనియన్లోనే ఇలాంటి నైపుణ్యం ఉన్న ఇంజినీర్లు ఉంటారని ఎఫ్బీ అభిప్రాయపడింది. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, పోలాండ్, నెదర్లాండ్స్, ఐర్లాండ్ లాంటి దేశాల్లో ఎఫ్బీ రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపట్టనున్నది. అయితే జాబిత దేశాల నుంచి బ్రిటన్ను విస్మరించినట్లు తెలుస్తోంది. మెటావర్స్కు చెందిన ఊహాత్మక ఐడియాను జూలైలో ఎఫ్బీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తొలిసారి బయటపెట్టారు. త్రీడీ వాతావరణంలో అనేక మంది.. మెటావర్స్‌లో వివిధ రకాల సమావేశాల్లో పాల్గొన్నే వీలు ఉంటుంది.