Swiss Re company | ఉద్యోగిని రొమ్ములపై బాస్ కామెంట్స్.. బాధితురాలికి రూ.13 కోట్ల నష్ట పరిహారం
Swiss Re company | ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ స్విస్ రే (Swiss Re) కు చెందిన సీనియర్ మేనేజర్.. ఓ మహిళా ఉద్యోగిపట్ల లింగ వివక్ష చూపుతూ ఆమె రొమ్ముల పరిమాణం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడమే గాక, సరైన కారణం తెలుపకుండానే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాడు. దాంతో బాధితురాలు న్యాయం కోసం లండన్ ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ట్రిబ్యునల్ ఆమెకు రూ.13 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశించింది.
లండన్ : ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ స్విస్ రే (Swiss Re) కు చెందిన సీనియర్ మేనేజర్.. ఓ మహిళా ఉద్యోగిపట్ల లింగ వివక్ష చూపుతూ ఆమె రొమ్ముల పరిమాణం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడమే గాక, సరైన కారణం తెలుపకుండానే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాడు. మేనేజర్ వ్యాఖ్యలతో ఆమె మానసికంగా వేదన అనుభవించారు. సరైన కారణం లేకుండా ఉద్యోగం నుంచి తొలగించడంతో ఆమె ఆర్థికంగా కూడా నష్టపోయారు. దాంతో బాధితురాలు న్యాయం కోసం లండన్ ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ట్రిబ్యునల్ ఆమెకు రూ.13 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశించింది.
వివరాల్లోకి వెళ్తే.. స్విస్ రే ఇన్సూరెన్స్ కంపెనీ లండన్ బ్రాచ్‌లో 2017లో జూలియా సోమర్ అనే మహిళ పొలిటికల్ రిస్క్ అండర్ రైటర్‌గా ఉద్యోగంలో చేరారు. 2021లో డెలివరీ కోసం సెలవులు తీసుకుని వచ్చిన తర్వాత ఆమె బాగా లావయ్యారు. దాంతో ఆమె బరువును గురించి పలుమార్లు కామెంట్ చేసిన సీనియర్ మేనేజర్ ఆఖరికి అర్ధాంతరంగా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాడు. దాంతో ఆమె తనకు రావాల్సిన బోనస్‌ను కూడా కోల్పోయారు.
ఈ క్రమంలో బాధితురాలు లండన్ ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. స్విస్ రే కంపెనీ ఎలాంటి కారణంగా చూపకుండానే తనను ఉద్యోగం నుంచి తొలగించడం వల్ల తాను వేతనాన్ని మాత్రమేగాక, కంపెనీ నిబంధనల ప్రకారం తనకు రావాల్సిన బోనస్‌ను కూడా కోల్పోయానని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాక 2017లో వర్క్ బ్రేక్‌లో డ్రింక్స్ తీసుకుంటుండగా బాస్ చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు.
వర్క్ డ్రింక్స్ సందర్భంగా తన దగ్గరికి వచ్చిన బాస్ ‘ఇఫ్ ఐ హావ్ బ్రెస్ట్స్ లైక్ యువర్స్, ఐ వుడ్ బి డిమాండింగ్ టూ’ అన్నారని, అంతేగాక ‘ఐ బెట్ యూ లైక్ టు బి టాప్ ఇన్ బెడ్’ అని కూడా వ్యాఖ్యానించారని లండన్ ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్‌కు సమర్పించిన పిటిషన్లో బాధితురాలు జూలియా సోమర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేసిన ట్రిబ్యునల్.. బాధితురాలికి రూ.13 కోట్ల (1.3 పౌండ్స్) ను నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిజాయితీ, పారదర్శకతతోనే సంస్థ అభివృద్ధి : హెచ్‌వోడీ జే. క్రిస్టోఫర్
టోల్ వసూళ్లపై ఉన్న శ్రద్ధ సౌకర్యాలపై ఏది?
‘పండుటాకులకు పింఛన్ కరువు’
Satyajit Ray Film Institute: నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను తప్పుపట్టిన సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్
OTT Movies | ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. ‘తెల్లకాగితం’ నుంచి ‘ఎస్సై యుగంధర్’ వరకు ఫుల్ లిస్ట్ ఇదే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

