వ్యాక్సిన్ రెండు డోస్‌లతో డెల్టా వేరియంట్‌కు చెక్!

ఆమ్స్టర్డామ్ : పలు దేశాలకు విస్తరిస్తున్న కరోనా వైరస్ డెల్టా వేరియంట్ నియంత్రణపై వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు కసరత్తు సాగిస్తున్నారు. వేగంగా విస్తరిస్తున్న డెల్టా వేరియంట్ నుంచి కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంటే రక్షణ పొందవచ్చని ఆధారాలు లభించాయని ఐరోపా ఔషధ ఏజెన్సీ (ఈఎంఏ) గురువారం పేర్కొంది. డెల్టా వేరియంట్‌తో యూరప్‌లో తదుపరి వేవ్ ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించిన క్రమంలో ఈఎంఏ ఈ అంచనాతో ముందుకు వచ్చింది.
డెల్టా వేరియంట్ ముప్పుపై తాము పరిశీలిస్తున్నామని, యూరప్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నాలుగు కరోనా వ్యాక్సిన్లు డెల్టా సహా యూరప్‌లో వ్యాప్తిలో ఉన్న అన్ని స్ట్రెయిన్ల నుంచి రక్షణ కల్పించేలా కనిపిస్తున్నాయని ఈఎంఏ వ్యాక్సిన్ స్ట్రేటజీ హెడ్ మార్కో కవలెరి పేర్కొన్నారు.
క్షేత్రస్ధాయిలో వస్తున్న ఆధారాల మేరకు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటే డెల్టా వేరియంట్ నుంచి రక్షణ లభిస్తుందని వెల్లడైందని చెప్పారు. వ్యాక్సిన్లతో వచ్చిన యాంటీ బాడీలు డెల్టాను తటస్ధీకరించే సామర్ధ్యం కలిగిఉన్నాయని ల్యాబ్ పరీక్షల్లోనూ తేలిందని తెలిపారు. ప్రస్తుతం యూరప్‌లో ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన నాలుగు కరోనా వ్యాక్సిన్లకు ఆమోదం లభించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

