కుక్క కోసం బస్సు ఆపిన డ్రైవర్.. వీడియో వైరల్

బ్యాంకాక్: ఇంటి నుంచి తప్పిపోయి రద్దీ రోడ్డుపై చిక్కుకున్న కుక్కను గమనించిన డ్రైవర్ బస్సును ఆపి దానిని రక్షించాడు. దీంతో అది బస్సు ఎక్కి సీటు కింద కూర్చొంది. చివరకు తన యజమానిని చేరుకున్నది. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఈ ఘటన జరిగింది. కుకీ అనే పేరున్న పెంపుడు కుక్క ఇటీవల నిర్మాణ స్థలం నుంచి దారి తప్పింది. మూడు రోజులుగా ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నది. రద్దీగా ఉన్న రహదారిపై మధ్యలో అది చిక్కుకున్నది. ఎన్ 166 అనే బస్సు ఆ కుక్క పక్కగా వెళ్తుండగా మెల్లగా వెళ్లాలని, దాని వల్ల ప్రమాదం వాటిల్లే ముప్పు ఉన్నదని డ్రవర్ తుయెన్ ప్రతుమ్తోంగ్కు రేడియో ద్వారా అనౌన్స్మెంట్ వినిపించింది.
కాగా, ఆ బస్సు డ్రైవర్ ఆ కుక్కను కాపాడేందుకు ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. కండక్టర్ కూడా ప్రయాణికుల అభిప్రాయాన్ని తెలుసుకున్నాడు. ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో డ్రైవర్ బస్సును ఆపాడు. దీంతో కండక్టర్ పిలుపుతో ఆ కుక్క బస్సులోకి ఎక్కింది. ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా ఒక సీటు కింద కూర్చొంది. బస్సు డిపోకు చేరగా దానికి ఆహారం, నీరు అందించారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న కుక్క యాజమాని డిపోకు వచ్చి తప్పిపోయిన దానిని తీసుకున్నారు. బస్ సిబ్బందికి ఐదు వేల నగదు ఇచ్చారు. నిరాకరించిన సిబ్బంది ఆ డబ్బును జంతు సంరక్షణ కేంద్రానికి విరాళంగా ఇచ్చారు. కాగా, ఆ కుక్క బస్సులోకి ఎక్కిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దానిని కాపాడిన బస్సు డ్రైవర్, కండక్టర్ చొరవను నెటిజన్లు ప్రశంసించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

