DonnaJean Wilde | ఏకధాటిగా 5 గంటలు అబ్డామినల్ ప్లాంక్.. 61 ఏళ్ల బామ్మ అసాధారణ రికార్డు..!
DonnaJean Wilde | ఆమె వయస్సు ఇరవై ఒక్కటో, ముప్పై ఒక్కటో కాదు ఏకంగా 61 ఏళ్లు. అరవై ఒక్క ఏళ్ల వయస్సులో కఠోర శ్రమతో ఆమె అసాధారణ రికార్డు నెలకొల్పింది. ఏకధాటిగా ఐదుగంటలపాటు అబ్డామినల్ ప్లాంక్ పొజిషన్ (Abdominal plank Position) లో ఉండి ప్రపంచ రికార్డు (World Record) సృష్టించింది. ఆమెనే కెనడా (Canada) కు చెందిన మహిళ డోన్నాజీన్ వైల్డ్ (DonnaJean Wilde).
DonnaJean Wilde : ఆమె వయస్సు ఇరవై ఒక్కటో, ముప్పై ఒక్కటో కాదు ఏకంగా 61 ఏళ్లు. అరవై ఒక్క ఏళ్ల వయస్సులో కఠోర శ్రమతో ఆమె అసాధారణ రికార్డు నెలకొల్పింది. ఏకధాటిగా ఐదుగంటలపాటు అబ్డామినల్ ప్లాంక్ పొజిషన్ (Abdominal plank Position) లో ఉండి ప్రపంచ రికార్డు (World Record) సృష్టించింది. ఆమెనే కెనడా (Canada) కు చెందిన మహిళ డోన్నాజీన్ వైల్డ్ (DonnaJean Wilde). వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, ఏదైనా సాధించాలనుకుంటే వయస్సు అడ్డుకాదని ఆమె నిరూపించారు.
హంట్స్‌మన్ వరల్డ్ సీనియర్ గేమ్స్‌లో భాగంగా జరిగిన ఈవెంట్లో ఆమె ఐదు గంటలు అబ్డామినల్ ప్లాంక్ పొజిషన్లో ఉండి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ ఫీట్‌తో ఆమె ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఇంకా విశేషమేమిటంటే.. ఆమె తన రికార్డును తానే బద్దలుకొట్టారు. ఈ ఏడాది మార్చిలో అల్బెర్టాలో 4 గంటల 30 నిమిషాల 11 సెకన్ల పాటు ప్లాంక్‌లో ఉండి ఆమె రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించి ఐదుగంటల మార్కును చేరారు.
స్టేజ్‌పై ఆమె ఏకాగ్రతతో ప్లాంక్ చేస్తుండగా 5 గంటల సమయం పూర్తికాగానే ప్రేక్షకులు పెద్ద ఎత్తున చప్పట్లతో ఆమెను అభినందించారు. అనంతరం డోనాజీన్ చిరునవ్వుతో తన విజయాన్ని ఆస్వాదించారు. ఈ అపురూప దృశ్యానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
People stood there for 5 hours watching her break that record? 🤔 https://t.co/PLjNWre0xE
— Victor Onyibest (@victor_onyibest) October 7, 2026
కాగా డోనాజీన్ వైల్డ్ రిటైర్డ్ టీచర్. ఆమెకు ఐదుగురు పిల్లలు. మనుమలు, మనవరాళ్లు కూడా ఉన్నారు. గత పదేళ్లకుపైగా ఆమె ప్లాంకింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. తన శారీరక ధారుడ్యం వెనుక కఠోర శ్రమ ఉందని, రోజూ ప్లాంకింగ్తోపాటు పుష్-అప్స్, వెయిట్‌లిఫ్టింగ్, రన్నింగ్ వంటివి తన శిక్షణలో భాగమని ఆమె తెలిపారు. 61 ఏళ్ల వయసులో ఆమె ప్రదర్శించిన శారీరక శక్తిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. అమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పిల్లల అభిరుచులను గుర్తించి ప్రోత్సహించాలి’
Covid 19 | కరోనా కొత్త వేరియెంట్ పీజే.2.1 వేగంగా వ్యాప్తి.. ప్రమాదకరమైనదా..?
Cruise Ship: స్టీరింగ్ కంట్రోల్ తప్పి క్రూయిజ్‌ను ఢీకొన్న ట్యాంకర్.. లగ్జరీ నౌక నుంచి దూకిన ప్రయాణికులు.. వీడియో
Sabitha Indra Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూలాన్ని మరిచిపోయారు.. మూసీ సుందరీకరణపై సబితాఇంద్రారెడ్డి ఫైర్
George Krish | సంక్రాంతి బరిలో శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’.. మొదలైన డబ్బింగ్ పనులు, రిలీజ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

