Donald Trump: ట్రంప్‌కు జైలు శిక్ష ఉండదు.. హష్ మనీ కేసులో జడ్జి తీర్పు!
Donald Trump: హష్ మనీ కేసులో డోనాల్డ్ ట్రంప్‌కు జైలు శిక్ష ఉండదని జడ్జి జువాన్ మెర్చన్ తెలిపారు. అయితే ఆ కేసుకు చెందిన తీర్పును జనవరి పదో తేదీన వెలువరించనున్నారు. ఆ రోజున జరిగే విచారణకు ప్రత్యక్షంగా లేదా వర్చువల్‌గా ట్రంప్ హాజరయ్యేందుకు అవకాశం కల్పించారు.
న్యూయార్క్: అమెరికా కాబోయే అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్(Donald Trump)కు.. హష్ మనీ కేసులో జైలు శిక్ష ఉండదని జడ్జి జువాన్ మెర్చన్ తెలిపారు. అయితే ఆ కేసుకు చెందిన తీర్పును జనవరి పదో తేదీన వెలువరించనున్నారు. ఆ రోజున జరిగే విచారణకు ప్రత్యక్షంగా లేదా వర్చువల్‌గా ట్రంప్ హాజరయ్యేందుకు అవకాశం కల్పించారు. పోర్న్ స్టార్ స్టార్మీ డానియేల్స్కు డబ్బులు చెల్లించిన ఘటనలో.. వ్యాపార రికార్డులను తప్పుగా చూపించినట్లు ట్రంప్‌పై ఆరోపణలు ఉన్నాయి. 2006లో స్టార్మీ డేనియల్స్‌ను ట్రంప్ లైంగికంగా వేధించారని, అయితే 2016 ఎన్నికల సమయంలో ఆమెను అడ్డుకునేందుకు డబ్బులు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో ట్రంప్‌పై విచారణ జరిగింది.
న్యూయార్క్ జ్యూరీ తీసుకున్న నిర్ణయాన్ని జడ్జి మెర్చన్ సమర్థించారు. 18 పేజీల రిపోర్టును ఆయన తయారు చేశారు. రియల్ ఎస్టేట్ టైకూన్ ట్రంప్‌పై ఎటువంటి షరతులు ఉండబోవన్నారు. ఒక దోషిగా ట్రంప్ వైట్‌హౌజ్‌లోకి ఎంటర్ అయ్యే అవకాశం కూడా లేదని ఆ రిపోర్టులో చెప్పారు. వాస్తవానికి ఆ కేసులో ట్రంప్‌కు నాలుగేళ్ల జైలుశిక్ష పడే ఛాన్సు ఉన్నట్లు అనుమానించారు. కానీ జైలు శిక్ష ఉండదని నిపుణులు భావించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

