అమెరికాలో ఐసీయూలు ఫుల్!

- మళ్లీ కరోనా ఉద్ధృతితో ఆందోళన
వాషింగ్టన్, నవంబర్ 12: అమెరికాలో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తున్నది. పలు ప్రాంతాల్లోని దవాఖానల ఐసీయూలు కరోనా రోగులతో నిండిపోతున్నాయి. రెండు వారాల కిందటితో పోలిస్తే 12 రాష్ర్టాల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల సంఖ్య పెరిగింది. వ్యాక్సినేషన్ రేటు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా దవాఖానలపై ఒత్తిడి తీవ్రంగా ఉండటం కరోనా తాజా వేవ్‌ను సూచిస్తున్నదని చెబుతున్నారు. పలు పశ్చిమ రాష్ర్టాల్లో చికిత్స అందించేందుకు వైద్యులు, నర్సులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒకవైపు దేశంలో డెల్టా వేరియంట్ వ్యాప్తి ఇప్పటికీ కొనసాగుతున్నది. మరోవైపు శీతాకాలంలో వైరల్ వ్యాధుల బెడద ఉంటుంది. ఈ నేపథ్యంలో రాబోయే కొన్ని నెలలు కష్ట కాలమేనన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. కరోనాకు ఫైజర్ సంస్థ మాత్రను తెచ్చినా ఇంకా అది అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి రాలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Alai-Balai | రాయపోల్‌లో అలయ్..బలయ్‌ని విజయవంతం చేయాలి
Depression | డిప్రెషన్‌కు అందరికీ ఒకేలాంటి చికిత్స పనిచేయదు.. అధ్యయనంలో వెల్లడి..
ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపునకు అంతా కృషి చేయాలి : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
MLC Dasoju Shravan Kumar | గ్రాడ్యుయేట్స్ నడుం బిగించి ముందుకు రావాలి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు యువకులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

