బీజింగ్ : పెంపుడు కుక్కలు, పిల్లుల మాటలను, భావాలను కృత్రిమ మేధ సాయం తో వాటి మాటలకు అర్థాలు చెప్తామంటున్నది మెంగ్ గ్జియోగి అనే చైనా స్టార్టప్. తాము రూపొందించిన ఏఐ ఆధారిత పెట్ కాలర్ జంతువుల శబ్దాలు, ప్రవర్తనను మనుషుల భాషలోకి తర్జుమా చేస్తుందని చెప్తున్నది.
దీని వల్ల మీ పెంపుడు జంతువు ఆడుకోవాలనుకొంటుందో.. ఆకలితో ఉందో ఇట్టే తెలుసుకోవచ్చని భరోసా ఇస్తున్నది! 95 శాతం కచ్చితత్వంతో వాటి మాటలకు అర్థాలు తెలుసుకోవచ్చని చెప్తున్నది.