టొరంటో: భారీగా పెరుగుతున్న ఇం డ్ల ధరలను కట్టడి చేయడానికి కెనడా ప్రభుత్వం కొత్త చట్టం చేసింది. దీని ప్రకారం విదేశీయులు రెండేండ్ల పాటు కెనడాలో ఆస్తులను కొనడం కుదరదు. అయితే, వలసదారులకు, శాశ్వత నివాసితులకు మాత్రం ఈ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చింది. వీరు కెనడాలో ఆస్తులు కొనుగోలు చేయవచ్చు. కరోనా మహమ్మారి మొదలయ్యాక కెనడాలో ఇండ్ల ధరలు భారీగా పెరిగాయి. చాలామంది పెట్టుబడిదారులు పెట్టుబడిగా ఇండ్లు కొనుగోలు చేస్తున్నందునే ధరలు పెరుగుతున్నాయని, ఇండ్లు ఖాళీగా ఉంటున్నాయని కెనడా ప్రభుత్వం గుర్తించింది.