ముంబై ,మే 4: ప్రపంచ కుభేరుడు వారెన్ బఫెట్ వారసుడెవరో తేలిపోయింది. బెర్క్‌షైర్ హాత్వే సంస్థ వైస్ చైర్మన్ గ్రెగ్ అబెల్ తన వారసుడిగా కొనసాగుతాడంటూ బఫెట్ ప్రకటించారు. వారెన్ బఫెట్ వయస్సు ప్రస్తుతం 90 ఏండ్లు దాటింది. ఆయన తర్వాత కంపెనీకి వారసులు ఎవరనేది ప్రశ్నకు జవాబు దొరికింది. మరో వైస్ చైర్మన్ అజిత్ జైన్‌ను కూడా ఇందుకు పరిశీలించినప్పటికీ, వయస్సు కీలకంగా మారిందని చెబుతున్నారు. గ్రెగ్, అజిత్ ఇద్దరూ అద్భుత వ్యక్తులని బఫెట్ అన్నారు. బెర్క్ షైర్ వైస్ చైర్మన్ చార్లీ ముంగర్ కూడా యాన్యువల్ మీటింగ్ సందర్భంగా అబెల్ పేరును ప్రస్తావించారు.
బఫెట్ స్థానాన్ని58 ఏండ్ల గ్రెగ్ అబెల్‌తో భర్తీ చేసేందుకు బోర్డు అంగీకారం తెలిపిందని స్వయంగా వారెన్ బఫెట్ తెలిపారు. చాలాకాలం నుంచి వారసుడి జాబితాలో గ్రెగ్ పేరు వినిపిస్తున్నది. కానీ వారసత్వ నిర్ణయాలను ఈ కంపెనీ రహస్యంగా ఉంచుతున్నది. తమ వద్ద ఇందుకు సంబంధించి పూర్తి ప్రణాళిక ఉందని గతంలోనే తెలిపింది.