మాస్క్ లేకుండానే.. బైక్ ర్యాలీలో పాల్గొన్న బ్రెజిల్ అధ్యక్షుడు

రియో డి జానరో: బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సనారో.. రియో డి జానరో వీధుల్లో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. వేలాది మంది బైకర్లతో ఆయన పరేడ్ నిర్వహించారు. నగరంలో ఉన్న వీధులన్నీ తిరుగుతూ.. మేటి బీచ్‌లను కూడా ఆయన టచ్ చేశారు. నిజానికి బ్రెజిల్లో కరోనా వల్ల ఇప్పటికే 4.5 లక్షల మంది మరణించారు. దీంతో ఆయన పాపులారిటీకి మచ్చ వచ్చింది. అయితే ప్రజల్లో మళ్లీ మద్దతును కూడగట్టుకునేందుకు బొల్సనారో భారీ సంఖ్యలో తన కార్యకర్తలతో బైక్ పరేడ్ నిర్వహించారు. మహహ్మారి కరోనా వేళ బొల్సనారో సరైన విధానాలను అవలంబించలేదని ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలపై సేనేట్ కమిషన్ ఇప్పటికే దర్యాప్తు మొదలు పెట్టింది.
ఆదివారం జరిగిన బైక్ ర్యాలీ.. రియో ఒలింపిక్ పార్క్ నుంచి ప్రారంభమైంది. సుమారు గంటన్నర సేపు అధ్యక్షుడు బొల్సనారో ర్యాలీలో పాల్గొన్నారు. పనేమా, కోపకబానా బీచ్‌ల మీదుగా ఆయన పరేడ్ సాగింది. దారి పొడువునా ఉన్న ఆయన మద్దతుదారులు జెండాలు ఊపుతూ కనిపించారు. అయితే మాస్క్ లేకుండా.. కేవలం హెల్మెట్‌తో మాత్రమే బొల్సనారో ర్యాలీలో పాల్గొన్నారు. ఇప్పటికే కోవిడ్ నిబంధనలు ఉల్లఘించిన అధ్యక్షుడు బొల్సనారోపై మరనహో రాష్ట్రం జరిమానా విధించింది. మాస్క్ ధరించకుండా ఉన్న వందలాది మంది ప్రజలకు ఆయన ఓ ఈవెంట్లో భూపట్టాలు అందించారు. ఆ ఘటన సందర్భంగా బొల్సనారోకు ఫైన్ వేశారు. వచ్చే ఏడాది బ్రెజిల్లో దేశాధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

