పడవకు నిప్పంటుకుని 143 మంది మృతి
మధ్య ఆఫ్రికా దేశం కాంగోలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చమురును తీసుకుని వస్తున్న భారీ పడవలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని బోల్తా పడటంతో 143 మంది మృతి చెందగా, వందలాది మంది గాయపడ్డారు.
- కాంగోలో వందల మందికి గాయాలు
కిన్షాసా, ఏప్రిల్ 19: మధ్య ఆఫ్రికా దేశం కాంగోలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చమురును తీసుకుని వస్తున్న భారీ పడవలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని బోల్తా పడటంతో 143 మంది మృతి చెందగా, వందలాది మంది గాయపడ్డారు. ఆ దేశ అధికారులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 15న వందలాది మంది ప్రయాణికులతో పాటు చమురును తీసుకుని వస్తున్న భారీ చెక్క పడవకు కాంగో నదిలో ఈక్వాటార్ ప్రావిన్స్ రాజధాని మబండాకాకు సమీపంలో హఠాత్తుగా నిప్పంటుకుంది. అనంతరం పేలుడు సంభవించడంతో చాలా మంది సజీవ దహనమయ్యారు.
కొంతమంది ప్రాణ భయంతో నీటిలోకి దూకేశారు. ఇంతవరకు 143 మృతదేహాలను వెలికి తీశామని, చాలా మంది మృతదేహాలు బొగ్గులా మారాయని అధికారులు తెలిపారు. పడవలో వంట కోసం నిప్పంటించేటప్పుడు జరిగిన నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు నిర్ధారించారు. ఈ దేశంలో కొన్ని నగరాలు, పట్టణాలకు తప్ప మిగిలిన చోట్లకు రోడ్డు, విమాన సౌకర్యాలు అంతగా లేవు. దాంతో చాలా మంది నదుల మీదుగా పయనిస్తుంటారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

