Watch: వేగంగా చెక్‌పోస్ట్ దాటేందుకు యత్నించిన బైకర్.. పోలీస్ ఏం చేశాడంటే?
shocking video | ఒక బైకర్ చాలా వేగంగా చెక్‌పోస్ట్ దాటేందుకు ప్రయత్నించాడు. అయితే చేతిలోని హెల్మెట్‌తో పోలీస్ అతడ్ని కొట్టాడు. దీంతో ఆ పోలీస్‌తోపాటు బైక్‌పై ఉన్న జంట ఎగిరి రోడ్డుపై పడ్డారు. వారితోపాటు మరి కొందరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ షాకింగ్ వీడియో క్లిప్ (shocking video) సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లిమా: ఒక బైకర్ చాలా వేగంగా చెక్‌పోస్ట్ దాటేందుకు ప్రయత్నించాడు. అయితే చేతిలోని హెల్మెట్‌తో పోలీస్ అతడ్ని కొట్టాడు. దీంతో ఆ పోలీస్‌తోపాటు బైక్‌పై ఉన్న జంట ఎగిరి రోడ్డుపై పడ్డారు. వారితోపాటు మరి కొందరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ షాకింగ్ వీడియో క్లిప్ (shocking video) సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పెరూలోని లా లిబర్టాడ్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం రాత్రి ట్రుజిల్లో-హువాంచకో హైవేపై బైకర్లు ప్రమాదకర విన్యాసాలు చేస్తూ, హైస్పీడ్ ఛేజింగ్‌లో పాల్గొన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ హైవేపై చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. కొంతమంది రేసర్లను ఆపి ప్రశ్నించారు.
కాగా, ఒక బైక్‌పై ఉన్న జంట చెక్‌పోస్ట్ వద్ద ఆగకుండా వేగంగా వెళ్లేందుకు ప్రయత్నించింది. అక్కడున్న ఒక పోలీస్ తన చేతిలోని హెల్మెట్‌తో బైక్ నడుపుతున్న వ్యక్తిని కొట్టాడు. అయితే ఆ వేగం ధాటికి బైక్‌పై ఉన్న జంటతోపాటు ఆ పోలీస్ కూడా ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఆ బైక్ ఒక వాహనాన్ని ఢీకొట్టడంతో అందులో ఉన్న వారు కూడా గాయపడ్డారు.
మరోవైపు ఎగిరి రోడ్డుపై పడిన పోలీస్ ఎరిక్ అవలోస్ టోర్రెస్‌కు ముఖం, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. బైక్ నడుపుతున్న 23 ఏళ్ల జాన్ వెర్డే రెయెస్కు పళ్లు ఊడటంతోపాటు ముఖానికి గాయాలయ్యాయి. అలాగే బైక్ వెనుక కూర్చొన్న 18 ఏళ్ల పమేలా ఫ్లోరియన్ శాంచెజ్ రోడ్డుపై అపస్మారక స్థితిలో పడిపోయింది. ఆమె తల, వెన్నుముఖకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, ఈ సంఘటనకు చెందిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే పది లక్షల మందికిపైగా ఈ వీడియో క్లిప్‌ను వీక్షించారు.
https://twitter.com/ClipsGoesViral/status/1719791420586762553?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1719791420586762553%7Ctwgr%5Edf4eca18572f40dd294ce15f14ab69bc76fcbde5%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Fworld-news%2Fbiker-tried-to-cross-checkpost-at-high-speed-this-is-what-the-cop-did-4539399
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

