వాషింగ్టన్: ఉక్రెయిన్లో రష్యా ఊచకోతకు పాల్పడుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపించారు. ఉక్రేయిన్ అన్న ఆలోచన రాకుండా చేసేలా పుతిన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఐఓవాలో రిపోర్టర్లతో మాట్లాడిన బైడెన్.. ఓ ప్రశ్నకు బదులిస్తూ.. అవును ఉక్రెయిన్లో జరుగుతోంది నరమేధమే అని అన్నారు. అంతర్జాతీయంగా రష్యా వ్యవహారశైలి ఎలా ఉందన్న దానిపై లాయర్లు నిర్ణయిస్తారని, అక్కడ ఊచకోత జరగుతున్నట్లు అనిపిస్తోందని బైడెన్ తెలిపారు. ఉక్రెయిన్లో రష్యా సైన్యం పాల్పడిన అకృత్యాలకు సంబంధించిన భయానక విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని బైడెన్ అన్నారు. రష్యా కేవలం యుద్ధ నేరాలకు పాల్పడుతున్నట్లు కొన్ని రోజుల క్రితం బైడెన్ అభిప్రాయపడ్డారు. కానీ తాజాగా ఆయన తన అభిప్రాయాన్ని మార్చేశారు.