రష్యా అమ్ములపొదిలో ‘బెల్గొరోడ్’
- వేల మైళ్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే సబ్‌మెరైన్
- శత్రు దేశంపై టోర్పెడో ప్రయోగిస్తే అణువిధ్వంసమే
మాస్కో, జూలై 13: ఉక్రెయిన్‌తో ఒకవైపు యుద్ధం కొనసాగుతున్న సమయంలో రష్యా అత్యంత శక్తిమంతమైన జలాంతర్గామిని నావికాదళంలో ప్రవేశపెట్టింది. అదే ‘కే-329 బెల్గొరోడ్’. అణ్వాయుధాలతో కూడిన అండర్ వాటర్ డ్రోన్లను వేల మైళ్ల దూరానికి మోసుకెళ్లడం ఈ సబ్‌మెరైన్ ప్రత్యేకత. ప్రపంచంలో ఇప్పటివరకూ ఇదే అత్యంత బరువైన. పొడవైన సబ్‌మెరైన్. ఈ జలాంతర్గామిలో మొత్తం ఆరు పొసెయిడన్ న్యూక్లియర్ ఆర్మ్డ్ టోర్పెడోలు ఉన్నాయి. శత్రు దేశ తీరాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ సబ్‌మెరైన్ నుంచి ఒక్క టోర్పెడోను ప్రయోగిస్తే.. శత్రు దేశ తీరమంతా రేడియోధార్మికతతో నిండిపోతుంది. దీంతో శత్రు దేశంలో అపార ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంది. 2027నాటికి ఇలాంటివే మరో రెండు జలాంతర్గాములను తీసుకురావడానికి రష్యా ప్రయత్నిస్తున్నది. ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న ఈ సమయంలో రష్యా ఈ తరహా సబ్‌మెరైన్‌ను ప్రయోగిస్తే.. రేడియోధార్మిక సునామీనే అని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పుతిన్ అధ్యక్షుడు కాదు.. పాలకుడు
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను పాలకుడిగా పిలిచే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే పార్లమెంట్‌కు చేరాయి. రష్యాలో ‘ప్రెసిడెంట్’ అనే పదం లేదని, ఇది అమెరికాలాంటి దేశాల నుంచి దిగుమతి అయ్యిందని.. కాబట్టి రష్యన్లకు సుపరిచితమైన ‘రూలర్’ అనే పదాన్నే ఉపయోగిస్తే బాగుంటుందని, అందుకే ఈ ప్రతిపాదన వచ్చిందని తెలుస్తున్నది.

Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

