Bangladesh | దుర్గా మాత ఆలయాన్ని సందర్శించిన బంగ్లాదేశ్ ప్రధాని.. అన్ని మతాలు సమానమేనని ప్రకటన
Bangladesh : బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రహమాన్ దుర్గామాత ఆలయాన్ని సందర్శించారు. అక్కడి దుర్గా పూజలో పాల్గొన్నారు. రంగ్‌పూర్‌లోని రాధా గోవింద్ ధర్మ సభా టెంపుల్లోని దుర్గా మాత పూజలో ప్రధాని తారిక్ బుధవారం పాల్గొన్నారు.
Bangladesh : బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రహమాన్ దుర్గామాత ఆలయాన్ని సందర్శించారు. అక్కడి దుర్గా పూజలో పాల్గొన్నారు. రంగ్‌పూర్‌లోని రాధా గోవింద్ ధర్మ సభా టెంపుల్లోని దుర్గా మాత పూజలో ప్రధాని తారిక్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో హాస్టల్ నిర్మాణానికి రూ.10 లక్షల బంగ్లా టాకాలను విరాళంగా అందజేశారు. అంతేకాదు.. ప్రతి ఒక్కరి మతానికి, విశ్వాసాలకు దేశంలో సమాన హక్కులు ఉంటాయని చెప్పారు.
దేవాలయ అధ్యక్షుడు భవతోష్ సర్కార్, జనరల్ సెక్రెటరీ ఖోకోన్ సర్కార్లు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం బంగ్లా ప్రధాని మాట్లాడారు. దేశంలోని వివిధ మతాలు, తెగలకు చెందిన ప్రజలు సమాన హక్కులను కలిగి ఉన్నారని చెప్పారు. హిందువులు, ముస్లింలు, బౌద్ధులు, క్రైస్తవులు, అందరూ ఇతర మతాల్ని గౌరవించాలని, సమాన దృష్టితో చూడాలని పిలుపునిచ్చారు. మత సామరస్యం గురించి వివరించారు.
బంగ్లాదేశ్‌లో 1971 లిబరేషన్ వార్ సందర్భంగా దేశ ప్రజలంతా మత విశ్వాసాలు, రాజకీయ సిద్ధాంతాలు, సామాజిక వైరుధ్యాలకు అతీతంగా దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు అని గుర్తు చేశారు. 2024లో జరిగిన విద్యార్థి ఉద్యమం గురించి కూడా ప్రస్తావించారు. ఏ ఉద్యమమైనా వివాదాలకు దూరంగా, దేశ భవిష్యత్ కోసం జరగాలని సూచించారు. ఇదే సందర్భంగా దేవాలయం ఉన్న పట్టణమైన రంగ్‌పూర్ అభివృద్ధి కోసం 1,800 కోట్ల బంగ్లా టాకాల విలువైన పనులను ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని, స్కూళ్లు, కాలేజీలు, కల్వర్టులు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు.. బంగ్లాదేశ్‌లో కొంతకాలంగా హిందువులపై వరుస దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. హిందువుల్ని చంపడం, దాడులు చేయడం, వారి ఆస్తుల్ని ధ్వంసం చేయడం, ఆలయాలపై దాడులు వంటివి జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో రహమాన్ ఆలయ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bangladesh | దుర్గా మాత ఆలయాన్ని సందర్శించిన బంగ్లాదేశ్ ప్రధాని.. అన్ని మతాలు సమానమేనని ప్రకటన
Kedarnath Dham | కేదార్‌నాథ్‌లో కురిసిన మంచు.. యాత్రికుల సందడి చూశారా..?
‘నీటి పారుదలశాఖ మంత్రిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి విఫలం’
Marco Rubio | అమెరికాలోనూ నిత్యం నిరసనలు జరుగుతాయ్.. భారత్‌లో నిరసనలపై మార్కో రూబియో
woman kills twin sons | ప్రియుడు అంగీకరించలేదని.. కవల కుమారులను చంపిన మహిళ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

