ఓ అంగ్రేజీ వృద్ధుడు షకీరా, బెయాన్స్ పాటలపై అదిరిపోయే స్టెప్పులేశాడు. బహిరంగ వేదికపై అతడు చేసిన డ్యాన్స్ నెటిజన్లను ఆకట్టుకుంది. అంత పెద్ద వయస్సులో జోష్‌గా నృత్యం చేయడం అందరినీ కట్టిపడేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
యూకేలోని సౌత్‌పోర్ట్‌లో ఆ వృద్ధుడు ప్రపంచంతో తనకెలాంటి సంబంధం లేనట్లు డ్యాన్స్‌లో మునిగిపోయాడు. నీలిరంగు చొక్కా, నల్లటి ప్యాంటు, టోపీ ధరించి షకీరా..వాకా వాకా, బెయాన్స్ క్రేజీ ఇన్ లవ్ పాటపై అదిరిపోయే స్టెప్పులేశాడు. ఈ వీడియోను ‘గుడ్‌న్యూస్ మూవ్మెంట్’ అనే పేజీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోకు 2.3 మిలియన్లకు పైగా వ్యూస్, 100కే లైక్‌లు వచ్చాయి. తమకు పార్ట్-2 కావాలంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు.