New form of Oxygen | కొత్త రకం ఆక్సిజన్‌ను కనిపెట్టిన భౌతిక శాస్త్రవేత్తలు.. భవిష్యత్ అణు ప్రయోగాలకు ఉపయుక్తం
New form of Oxygen | అంతర్జాతీయ భౌతిక శాస్త్రవేత్తల బృందం కొత్త రకం ఆక్సిజన్‌ను కనిపెట్టింది. జపాన్‌లోని టోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన యొషుకె కొండో అనే అణు భౌతిక శాస్త్రవేత్త నేతృత్వంలోని అంతర్జాతీయ భౌతిక శాస్త్రవేత్తల బృందం ఆక్సిజన్-28 ను గుర్తించింది.
టోక్యో: అంతర్జాతీయ భౌతిక శాస్త్రవేత్తల బృందం కొత్త రకం ఆక్సిజన్‌ను కనిపెట్టింది. జపాన్‌లోని టోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన యొషుకె కొండో అనే అణు భౌతిక శాస్త్రవేత్త నేతృత్వంలోని అంతర్జాతీయ భౌతిక శాస్త్రవేత్తల బృందం ఆక్సిజన్-28 ను గుర్తించింది. ఇది ఆక్సిజన్ పరమాణువుకు సంబంధించిన ఒక కొత్త రకం ఐసోటోప్ అని సైంటిస్టులు తెలిపారు.
ఈ ఆక్సిజన్-28 ఐసోటోప్ 20 న్యూట్రాన్లను, ఎనిమిది ప్రోటాన్లను కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఆక్సిజన్ రకాల్లో ఈ ఆక్సిజన్ పరిమాణంలో పెద్దదిగా చెప్పవచ్చు. అయితే ఈ ఆక్సిజన్ ఐసోటోప్ అంచనాల కంటే కొంత తక్కువ స్థిరత్వాన్నే కలిగి ఉన్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ, అణు భౌతిక శాస్త్రంలో ఇది ప్రధానమైన డిస్కవరీ అంటున్నారు.
ఇరవై న్యూట్రాన్లు (N=20), ఎనిమిది ప్రోటాన్లు (Z=8) కలిగి ఉండి చాలాపెద్ద న్యూట్రాన్, ప్రోటాన్ నిష్పత్తిగల ఈ ఆక్సిజన్ ఐసోటోప్‌ను ప్రకృతిలో అసాధారణమైనదిగా చెప్పవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. భవిష్యత్ అణు ప్రయోగాలకు ఈ ఐసోటోప్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పని చేయాలి’
అన్ని డివిజన్ల సమగ్ర అభివృద్ధే లక్ష్యం : నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

