మాస్కో: గూఢచర్యానికి పాల్పడుతున్నాడనే అభియోగాలపై వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు చెందిన అమెరికన్ రిపోర్టర్‌ను రష్యా అరెస్టు చేసింది. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత గూఢచర్యం ఆరోపణలపై రష్యాలో అమెరికన్ జర్నలిస్టు అరెస్టు కావడం ఇదే మొదటి సారి. ఉరల్ మౌంటెన్స్ నగరంలోని యెకాటెరిన్బర్గ్లో రహస్య సమాచారాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్న వాల్‌స్ట్రీట్ జర్నల్ జర్నలిస్టు ఇవాన్ గెర్ష్‌కోవిచ్‌ను గురువారం అదుపులోకి తీసుకున్నట్టు ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ తెలిపింది.