Nepal plane crash | విమాన ప్రమాదంలో 22 మృతదేహాలు వెలికితీత
న్యూఢిల్లీ : విమాన ప్రమాదంలో 22 మృతదేహాలను వెలికి తీసినట్లు నేపాల్ ఆర్మీ తెలిపింది. తారా ఎయిర్‌లైన్‌కు చెందిన విమానం 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న సమయంలో ఈ నెల 29న కూలిపోయిన విషయం తెలిసిందే. ఫొఖారా నుంచి హిమాలయాల్లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన జామ్సన్కు వెళ్తున్న సమయంలో ఘటన చోటు చేసుకున్నది. ఫొఖారా నుంచి ఉదయం 10.15 గంటలకు బయలుదేరగా.. 15 నిమిషాల తర్వాత కంట్రోల్ సెంటర్‌తో సంబంధాలు తెగిపోయాయని ఎయిర్‌లైన్ ప్రతినిధి తెలిపారు. ఆ తర్వాత విమానంలో నలుగురు భారతీయులు, ఇద్దరు జర్మనీ వాసులు, 13 మంది నేపాల్ పౌరులు, మరో ముగ్గురు సిబ్బంది ఆచూకీ తెలియకుండా పోయింది.
మరుసటి రోజు పైలట్ మొబైల్ ఫోన్ ఆధారంగా ట్రాక్ చేసి, విమానం కూలిపోయినట్లు నేపాల్ ఆర్మీ ధ్రువీకరించింది. ముస్తాంగ్ జిల్లాలో విమానం కూలిపోగా.. సోమవారం వరకు 21 మృతదేహాలను వెలికి తీయగా.. మంగళవారం మరో మృతదేహాన్ని వెలికితీసినట్లు నేపాల్ అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో నలుగురు భారతీయులు సహా ఇద్దరు జర్మనీ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఏవియేషన్నేపాల్ (aviationnepal.com) కెనడియన్ విమానాల తయారీ కంపెనీ హావిల్లాండ్ తయారు చేసిన ఈ విమానం సుమారు 50 సంవత్సరాలుగా నేపాల్‌లో సేవలందిస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
Jailer 2 | ‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. దీపావళికి విడుదల చేస్తే బాగుంటుందా?
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
KTR | తెలంగాణ నా గోత్రం… సిరిసిల్ల కులం.. మీరుపెట్టిన భిక్షతోనే ఇంతదాక ఎదిగిన.. కేటీఆర్ భావోద్వేగం
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

