Alligator Guards Woman’s Body | మహిళపై మొసలి దాడి.. ఆ తర్వాత ఆమె మృతదేహానికి రక్షణ
Alligator Guards Woman’s Body | ఒక మహిళపై మొసలి దాడి చేసింది. ఆ తర్వాత ఆమె మృతదేహానికి అది రక్షణగా ఉంది. (Alligator Guards Woman’s Body ). ఆమె సమీపానికి ఎవరినీ రానివ్వలేదు.
వాషింగ్టన్: ఒక మహిళపై మొసలి దాడి చేసింది. ఆ తర్వాత ఆమె మృతదేహానికి అది రక్షణగా ఉంది. (Alligator Guards Woman’s Body ). ఆమె సమీపానికి ఎవరినీ రానివ్వలేదు. విస్తూపోయే ఈ సంఘటన అమెరికాలో జరిగింది. సౌత్ కరోలినాలోని హిల్టన్ హెడ్ ఐలాండ్‌కు చెందిన 69 ఏళ్ల వృద్ధురాలు మంగళవారం తన పెంపుడు కుక్కతో కలిసి వాకింగ్‌కు వెళ్లింది. అయితే గోల్ఫ్ కోర్స్ సమీపంలోని మడుగు వద్ద ఒక మొసలి ఆ మహిళపై దాడి చేసింది. దీంతో ఆమె అచేతనంగా అక్కడ పడి ఉంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, బ్యూఫోర్ట్ కౌంటీ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే వృద్ధురాలిపై దాడి చేసిన మొసలి ఆమె మృతదేహానికి కాపాలాగా ఉంది. మృతదేహం దగ్గరకు ఎవరినీ రావ్వలేదు. రెస్క్యూ ఆపరేషన్‌ను కూడా అడ్డుకున్నది. చివరకు పోలీసులు ఆ మొసలిని అక్కడి నుంచి తొలగించారు. అనంతరం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. బ్యూఫోర్ట్ కౌంటీలో మొసలి దాడి చేయడం ఏడాదిలోపు రెండో సంఘటన అని పోలీసులు పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- alligator
- Fatal Attack
- guards
- US
RELATED ARTICLES
తాజా వార్తలు
Traffic Challan | ఫుట్‌పాత్‌పై బైక్ నడిపితే రూ.5 వేలు.. వన్‌వేలో వెళ్తే రూ.10 వేల ఫైన్? బెంగళూరులో కఠినంగా ట్రాఫిక్ రూల్స్!!
Bigg Boss 10 | త్రిగుణ్‌కు అదిరిపోయే గిఫ్ట్.. ముఖేష్, వంశీ మధ్య తీవ్ర వాగ్వాదం
Census 2027 | దేశవ్యాప్తంగా జనగణనకు ముహూర్తం ఖరారు.. జనవరి 25 నుంచి ఇంటింటికీ లెక్కింపు!
Aurangzeb Tomb | ఔరంగజేబు సమాధి తొలగింపునకు డెడ్‌లైన్ ఫిక్స్.. సంచలన ప్రకటన చేసిన మహారాష్ట్ర మంత్రి!
Panchayat Raj | ఆరు నెలలకో అధికారి.. పీఆర్ఆర్డీలో మూడేండ్లలో ఆరుగురు స్పెషల్ సీఎస్ల బదిలీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

