Fish with hands | ఆస్ట్రేలియా బీచ్‌లో వింత చేప దర్శనం.. పూర్వ వాజాలకు బదులుగా చేతులు
Fish with hands | సాధారణంగా అయితే చేపలలో చలనాంగాలుగా వాజాలు తోడ్పడుతాయి. చేప ఈదడానికి, నీటిలో కిందికి పైకి వెళ్లడానికి, నీటి నడుమ కదలకుండా సమతాస్థితిలో ఆగడానికి, తాను ప్రయాణిస్తున్న దిశను మార్చుకోవడానికి ఈ వాజాలు తోడ్పడుతాయి.
టాస్మానియా: సాధారణంగా అయితే చేపలలో చలనాంగాలుగా వాజాలు తోడ్పడుతాయి. చేప ఈదడానికి, నీటిలో కిందికి పైకి వెళ్లడానికి, నీటి నడుమ కదలకుండా సమతాస్థితిలో ఆగడానికి, తాను ప్రయాణిస్తున్న దిశను మార్చుకోవడానికి ఈ వాజాలు తోడ్పడుతాయి. అంతేతప్ప ఒకచోట నుంచి మరో చోటుకు వెళ్లడానికి వాటికి మనుషుల మాదిరిగా కాళ్లు, చేతులు ఉండవు. కానీ ఆస్ట్రేలియాలో తాజాగా ఓ వింత చేప దర్శనమిచ్చింది. దాని పొట్టకింద పూర్వ వాజాలకు బదులుగా రెండు చేతులు ఉన్నాయి.
ఆస్ట్రేలియాలోని టాస్మానియా బీచ్‌లో కెర్రీ యారే అనే మహిళ ఈ వింత చేపను గుర్తించింది. తాను బీచ్‌లో రన్నింగ్ చేస్తుండగా ఇసుకపై ఒక చేప కనిపించిందని, సాధారణ పఫర్‌ఫిష్ అనుకుని మరింత దగ్గరికి వెళ్లిచూడగా ఇసుకలో దాని కాళ్లు కనిపించాయని కెర్రీ తెలిపింది. కాగా, ఈ వింత చేప జాతి చాలా పురాతనమైనదని, ఇప్పుడు అవి అంతరించిపోతున్న దశలో ఉన్నాయని జీవశాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అంతరించిపోతున్న సముద్ర జీవుల్లో ఈ వింత చేపలే ముందున్నాయని అంటున్నారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద వీటి జనాభా 2,000 కు మించి ఉండదని చెబుతున్నారు. ఈ అరుదైన జాతి చేపలు అంతరించిపోకుండా కాపాడుకోవడానికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందంటున్నారు. ఈ చేపలు తన చేతులను సముద్రం ఉపరితలంపైన, ఒడ్డున ఇసుకపై నడవడానికి ఉపయోగించుకుంటాయని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
Water Tankers | సిద్దిపేట జిల్లాలో ట్యాంకర్లతో పొలం పారిస్తున్న రైతన్న.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

