Sudan | సాంకేతిక లోపంతో కుప్పకూలిన విమానం.. నలుగురు సైనికులు సహా 9 మంది మృతి
సూడాన్‌లోని (Sudan) పోర్ట్ సూడాన్ ఎయిర్‌పోర్టులో (Port Sudan airport) సాంకేతిక లోపం తలెత్తడంతో ఓ విమానం కుప్పకూలింది (Crashed). పోర్ట్ సూడాన్ విమానాశ్రయం నుంచి పౌరులతో వెళ్తున్న ఆంటోనోవ్ విమానం (Civilian plane).. టేకాఫ్ అవుతుండగా సాంకేతిక లోపంవల్ల (Technical failure) కూలిపోయింది.
ఖార్టూమ్: సూడాన్‌లోని (Sudan) పోర్ట్ సూడాన్ ఎయిర్‌పోర్టులో (Port Sudan airport) సాంకేతిక లోపం తలెత్తడంతో ఓ విమానం కుప్పకూలింది (Crashed). పోర్ట్ సూడాన్ విమానాశ్రయం నుంచి పౌరులతో వెళ్తున్న ఆంటోనోవ్ విమానం (Civilian plane).. టేకాఫ్ అవుతుండగా సాంకేతిక లోపంవల్ల (Technical failure) కూలిపోయింది. దీంతో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. వారిలో నలుగురు సైనిక సిబ్బంది (Military personnel) ఉన్నట్లు ఆ దేశ సైన్యం వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి ప్రాణాలతో బయటపడిందని తెలిపింది.
సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లో (Khartoum) సైన్యం, పారామిలిటరీ బలగాల మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమై ఆదివారం నాటికి వంద రోజులు పూర్తయింది. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి ఖార్టూమ్, ఇతర ప్రాంతాల్లో సూడాన్ సైన్యం, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా, ఖార్టూమ్‌కు తూర్పున 890 కిలోమీటర్ల దూరంలో పోర్ట్ సుడాన్ విమానాశ్రయం ఉన్నది. ఘర్షణల కారణంగా ఖార్టూమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సేవలను నిలిపివేశారు. దీంతో దేశంలోని ప్రధాన విమానాశ్రయంగా పోర్ట్ సుడాన్ ఎయిర్‌పోర్టును ఉపయోగిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

