రగులుతున్న ఫ్రాన్స్
పోలీస్ కాల్పుల్లో నాహెల్ అనే 17 ఏండ్ల యువకుడి మృతితో ఫ్రాన్స్‌లో మూడో రోజూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. దేశమంతా నిరసనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా యువత పెద్దయెత్తున ఆందోళనలో పాల్గొని విధ్వంసం సృష్టించారు. ముందుజాగ్రత్త చర్యగా పారిస్‌లో బస్సు, ట్రామ్ సర్వీసులను నిలిపివేశారు. ఆ ఆందోళన బెల్జియం రాజధాని బ్రస్సెల్స్కు కూడా పాకింది. ఆందోళనకారులకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు ప్రయోగించగా, ఆందోళనకారులు రాళ్లు, వెలిగించిన నిప్పు వస్తువులను వారిపైకి విసిరారు.
- యువకుడి కాల్చివేతతో ఉద్రిక్తత
- పారిస్‌లో పలు వాహనాలకు నిప్పు
- పోలీసులపై దాడులు
- 200 మంది పోలీసులకు గాయాలు, 600 మంది అరెస్ట్
నాంటెర్రె (ఫ్రాన్స్), జూన్ 30: పోలీస్ కాల్పుల్లో నాహెల్ అనే 17 ఏండ్ల యువకుడి మృతితో ఫ్రాన్స్‌లో మూడో రోజూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. దేశమంతా నిరసనలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా యువత పెద్దయెత్తున ఆందోళనలో పాల్గొని విధ్వంసం సృష్టించారు. ముందుజాగ్రత్త చర్యగా పారిస్‌లో బస్సు, ట్రామ్ సర్వీసులను నిలిపివేశారు. ఆ ఆందోళన బెల్జియం రాజధాని బ్రస్సెల్స్కు కూడా పాకింది. ఆందోళనకారులకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు ప్రయోగించగా, ఆందోళనకారులు రాళ్లు, వెలిగించిన నిప్పు వస్తువులను వారిపైకి విసిరారు. పారిస్ శివారు క్లామర్ట్లో కర్ఫ్యూ విధించారు. గత రాత్రి నుంచి దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ అల్లర్లలో 200 మంది పోలీస్ అధికారులు గాయపడగా, 600 మందిని అరెస్ట్ చేశారు.
పారిస్ సబ్ అర్బన్ నాంటెర్రెలో పోలీస్ వాహనాలతో పాటు పలు కార్లకు నిప్పుపెట్టారు. సిటీలోని ఒక పోలీస్‌స్టేషన్‌పై దాడి జరిగింది. పారిస్‌లోని రివోలిలో పలు షాపులను లూటీ చేశారు. అబుర్విల్లర్స్లో కూడా ఒక బస్సు డిపోను తగులబెట్టారు. పారిస్, పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఆగ్రహంతో పలువురు పోలీసులపై టపాకాయలను వెలిగించి విసరడం కన్పించింది. కాగా, గొడవలను నివారించడానికి 40 వేల మంది పోలీసులను మోహరించారు. యువకుడిపై మంగళవారం కాల్పులకు పాల్పడ్డ పోలీస్ అధికారి పాస్కల్ ప్రాచెపై విచారణ ప్రారంభమైంది. తన క్లయింట్ ఉద్దేశపూర్వకంగా కాల్పులకు పాల్పడలేదని, తప్పనిసరి పరిస్థితుల్లో ఆయను కాల్పులకు దిగాల్సి వచ్చిందని ఆయన లాయర్ తెలిపారు. జరిగిన దురదృష్టకర ఘటనకు పోలీస్ అధికారి క్షమాపణ కోరుతున్నట్టు అయన చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Firefighters
- France
- hurt
- Nahel
RELATED ARTICLES
తాజా వార్తలు
Promotions | టీజీఎస్ ఆర్టీసీ హైదరాబాద్ జోన్లో 63 మంది సిబ్బందికి పదోన్నతులు
‘ఏఐటీయూసీ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి’
‘ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇంటింటి జీవిత బీమా’
Anil Byreddy | ఆస్ట్రేలియాలో ‘తెలంగాణ భవన్’ నిర్మాణానికి శ్రీకారం: అనిల్ బైరెడ్డి
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేద కుటుంబాలకు అండ
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

