న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.. విద్యార్థిని మృతి
New York | అమెరికాలోని న్యూయార్క్ (New York) వీధులు మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లాయి. న్యూయార్క్ సిటీలోని బ్రాన్స్క్ హైస్కూల్ బయట బయట ఓ దుడగుడు కాల్పులు జరిపాడు. దీంతో స్కూల్ నుంచి బయటకు వస్తున్న ఓ విద్యార్థిని మృతిచెందింది.
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ (New York) వీధులు మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లాయి. న్యూయార్క్ సిటీలోని బ్రాన్స్క్ హైస్కూల్ బయట బయట ఓ దుడగుడు కాల్పులు జరిపాడు. దీంతో స్కూల్ నుంచి బయటకు వస్తున్న ఓ విద్యార్థిని మృతిచెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్కూల్ ఎదురుగా ఓ వ్యక్తి మరికొందరితో గొడవపడుతున్నాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన అతడు ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో స్కూల్ నుంచి బయటకు వస్తున్న అమ్మాయి ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. మరో ఇద్దరు కాళ్లకు గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముగ్గురిని దవాఖానకు తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన ఆ యువతి మృతిచెందిందని న్యూయార్క్ పోలీస్ చీఫ్ కీఛంట్ సెవెల్ చెప్పారు. దుండగుడు పరారీలో ఉన్నాడని, అతనికోసం గాలిస్తున్నామని వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

