Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
Bangladesh : బంగ్లాదేశ్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సముద్రం పక్కనున్న ఒక రిసార్ట్లో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మరణించారు. 9 మంది గాయపడ్డారు.
Bangladesh : బంగ్లాదేశ్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సముద్రం పక్కనున్న ఒక రిసార్ట్లో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మరణించారు. 9 మంది గాయపడ్డారు. మరికొందరు మంటల్లో చిక్కుకోగా.. వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటన ఈశాన్య బంగ్లాదేశ్, కాక్స్ బజార్ జిల్లాలో శనివారం ఉదయం 6.30 గంటలకు జరిగింది. ఇనాని ప్రాంతం, మెరైన్ డ్రైవ్ పరిధిలోని, పత్వార్టెక్ బీచ్లో టుపుటుప్ పేరుతో ఒక రెస్టో అండ్ రిస్టార్ ఉంది.
సముద్రం ఒడ్డునే ఉన్న ఈ రిసార్ట్ మూడంతస్తులుగా ఉంది. దీన్ని పూర్తిగా వెదురుతో నిర్మించారు. ఈ రిసార్ట్లో ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మొత్తం వెదురుతో నిర్మించిన రిసార్ట్ కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. మూడంతస్తులు.. మంటలు వేగంగా వ్యాపించడంతో పై అంతస్తుల్లో ఉన్న వారు కిందికి రావడానికి వీలు కాలేదు. దీంతో చాలా మంది లోపలే చిక్కుకుపోయారు. అగ్నిప్రమాదం సంభవించిన తరుణంలో అందులో 30 మంది వరకు ఉన్నట్లు అంచనా.
వీరిలో 4-5 మంది మాత్రమే బయటకు రాగలిగారు. మిగతా వారు మంటల కారణంగా లోపలే చిక్కుకుపోయారు. వీరిలో 10 మంది మరణించారు. మరో 9 మంది గాయపడ్డారు. ఘటన గురించి సమాచారం అందుకున్న స్తానిక ఫైర్ సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మంటలను ఆర్పే చర్యలు చేపట్టారు. లోపల ఉన్న వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే, మంటలు అంత త్వరగా అదుపులోకి రాలేదు. దీంతో భారీ నష్టం సంభవించింది. అధికారులు 10 మంది మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు.
గాయపడ్డ 9 మందిని చికిత్స కోసం స్తానిక ఆస్పత్రికి తరలించారు. మంటల్లో చిక్కుకున్న ఇంకొంతమందిని గుర్తించాల్సి ఉంది. అయితే, ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై విచారణ జరుగుతోంది. కిచెన్లో చెలరేగిన మంటల కారణంగానే అగ్ని్ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
‘పంచాయతీల సమస్యలను పరిష్కరించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

