ముగిసిన యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాలు

యాదాద్రి లక్ష్మీనరసింహుడికి గురువారం అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవం నిర్వహించారు. ఈ నెల 15న ప్రారంభమై 11 రోజుల పాటు సాగిన తిరుకల్యాణ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి డోలోత్సవంతో అర్చకులు ముగింపు పలికారు. స్వామివారి బాలాలయం మండపంలో 108కలశాలు, 108 ద్రవ్యాలు, 108 ఔషధాలు, 108 మంత్ర జపాలతో వేదయుక్తంగా అర్పించారు. అష్టోత్తర శత ఘటాలకు ముక్కోటి దేవతలను ఆవాహన చేసి ఆహుతులను సమర్పించారు. మహాపూర్ణాహుతి నిర్వహించి స్వామివారికి శాంతి అభిషేకం చేశారు. 108 సంఖ్యతో భగవానుడి యొక్క తత్తం నిక్షిప్తమై ఉన్నందున అష్టోత్తర శతఘటాభిషేకానికి ఎంతో విశిష్టత ఉందని అర్చకులు తెలిపారు. శ్రీవారి అమ్మవార్లకు పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ సుగంధ ద్రవ్యాలు, ఫల జలాలు, సుగంధ భరిత ఏలాలవంగాది చూర్ణ జలాలు, మంత్ర పూర్వక జపాలతో అభిషేకించారు. సాయంత్రం నిత్యారాధనలు చేసిన అనంతరం రాత్రి 9 గంటలకు శ్రీస్వామివారి శృంగార డోలోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. యజ్ఞచార్యులు, వేదపండితులను ఘనంగా సన్మానించి, ఉత్సవ పరిసమాప్తికి సూచకంగా మంగళ నీరాజనాలు పలికారు.
ఉత్సవ పరిసమాప్తికి సూచకమే అష్టోత్తర శతఘటాభిషేకం
గత 11 రోజులుగా అంగరంగ వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలకు పరిసమాప్తి సూచకంగా అష్టోత్తర శతఘటాభిషేక మహోత్సవాన్ని గురువారం నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో మూలమూర్తులతో పాటు ఉత్సవమూర్తులకు అభిషేక మహోత్సవాన్ని ఆగమశాస్ర్తానుసారంగా చేపట్టారు. ఈ ఘటాభిషేకంలో కలశాలలో ఆవాహన చేసిన పవిత్ర జలాలతో పాటు వివిధ ఫలాల రసాలను మంత్ర పూతములను గావించి అభిషేకించడమే ఈ వేడుక ప్రత్యేకత. సృష్టిలోని సర్వవిధ ఫలాలు, పుష్పాలు, రసాలు, జలాలు భగవత్ ప్రీతికరములై ఉన్నందున వాటిని భగవత్ సమర్పణ బుద్ధితో అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ వేడుకను నిర్వహించారు. పంచామృత స్నపన ఫలితాలను ఆగమశాస్త్రంలో పేర్కొనుచూ.. ఇహ, పరమ ముక్తిప్రదం సర్వవిధ శుభంకరం అనే మరెన్నో అద్భుతాలైన ఫలితాలను అందించగలదని పురాణాలు, వేదాలు చెబుతున్నాయి.
యాదాద్రీశుడికి సంప్రదాయ పూజలు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో గురువారం ఉదయం అర్చకులు స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకించి ప్రత్యేక పూజలు చేపట్టారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. కొండపైన ఉన్న పర్వతవర్ధిని రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్ఠమూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారికి రూ.6,73,884 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు.
నేటి నుంచి ఆర్జిత సేవలు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఆర్జిత సేవలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత 11 రోజులుగా రద్దు చేసిన స్వామివారి నిత్యకల్యాణం, సుదర్శన నరసింహహోమం, అర్చనలు, భోగాలు, బలిహరణ, అభిషేకాలు, మొక్కు సేవలు యథావిధిగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో గీత తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | రాముడు, సీత ప్రేమకు సంగీత రూపం.. ‘రామాయణ’ నుంచి ‘రంగులు రంగులే’ పాట విడుదల!
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ వివాదంపై స్పందించిన దర్శకుడు వేణు ఉడుగుల.. ట్రోలర్స్‌కు గట్టి కౌంటర్!
Atrial Fibrillation | ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
BRS | కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు భార్గవ్ దేశ్‌పాండే
Tamil Nadu | తమిళనాడులో భారీ వర్షాలు.. పలు పర్యాటక ప్రాంతాలు మూసివేత
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

