స్వయం ఉపాధితో..మహిళలు ఆర్థికంగా ఎదగాలి
మహిళలు కుట్టు శిక్షణతో స్వయం ఉపాధిని పొందటంతోపాటు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల అన్నారు. మంగళవారం పాత మలక్‌పేట డివిజన్లోని పద్మానగర్‌లో ఏర్పాటు చేసిన సాలార్ యే మిల్లత్ ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
- మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల
- పాత మలక్‌పేటలో సాలార్ యే మిల్లత్
- ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం
మలక్‌పేట, డిసెంబర్ 12: మహిళలు కుట్టు శిక్షణతో స్వయం ఉపాధిని పొందటంతోపాటు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల అన్నారు. మంగళవారం పాత మలక్‌పేట డివిజన్లోని పద్మానగర్‌లో ఏర్పాటు చేసిన సాలార్ యే మిల్లత్ ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు కుటుంబాన్ని చక్కబెట్టుకుంటూనే కుట్టు శిక్షణతో స్వయం ఉపాధిని ఇంటి నుంచే పొందవచ్చన్నారు. మహిళలు కుటుంబ పోషణలో పురుషులకు చేదోడు వాదోడుగా నిలవడంతో కుటుంబ పోషణ భారం తగ్గుతుందని, కుటుంబాలు త్వరగా ఆర్థికంగా నిలదొక్కుకుంటాయని తెలిపారు.
మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఎంఐఎం పార్టీ సాలార్ యే మిల్లత్ ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసిందని చెప్పారు. ఇందులో ఉచిత శిక్షణతోపాటు కుట్టు మిషన్లను కూడా అందించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాత మలక్‌పేట డివిజన్ ఎంఐఎం అధ్యక్షుడు షఫీ, డివిజన్ నాయకులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రమాదవశాత్తూ నీట మునిగి వ్యక్తి మృతి
Alai-Balai | రాయపోల్‌లో అలయ్..బలయ్‌ని విజయవంతం చేయాలి
Depression | డిప్రెషన్‌కు అందరికీ ఒకేలాంటి చికిత్స పనిచేయదు.. అధ్యయనంలో వెల్లడి..
ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపునకు అంతా కృషి చేయాలి : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్
MLC Dasoju Shravan Kumar | గ్రాడ్యుయేట్స్ నడుం బిగించి ముందుకు రావాలి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

