TWJF | జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించండి.. ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులపై చొరవ చూపండి..!
హైదరాబాద్, ఏప్రిల్ 28 : రాష్ట్రంలోని వేలాది మంది జర్నలిస్టులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను వేగంగా పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
హైదరాబాద్, ఏప్రిల్ 28 : రాష్ట్రంలోని వేలాది మంది జర్నలిస్టులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను వేగంగా పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మంగళవారం హైదరాబాద్‌లోని మాసాబ్ ట్యాంక్ సమాచార భవన్లో ఐ అండ్ పీఆర్ ప్రత్యేక కమిషనర్ ముకుంద్ రెడ్డిని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బి.బసవపున్నయ్య నేతృత్వంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.రాజశేఖర్, గుడిగ రఘు, కార్యదర్శులు బి జగదీశ్వర్, గండ్ర నవీన్ కలిశారు. జర్నలిస్టుల సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చి.. పరిష్కారానికి చొరవ చూపాలని వినతిపత్రాన్ని అందజేశారు.
గత 40 ఏండ్లుగా తెలంగాణలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వలేదని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నాయకులు ఐ అండ్ పీఆర్ ప్రత్యేక కమిషనర్ ముకుంద్ రెడ్డికి గుర్తు చేశారు. జర్నలిస్టుల సమస్యలపై అవగాహన ఉన్నందున ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించే విషయంలో చొరవచూపాలని టీడబ్ల్యూజేఎఫ్ నేతలు కోరారు. అక్రెడిటేషన్ల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా డెస్క్ జర్నలిస్టులు ఆందోళనతో ఉన్నారనీ, ప్రింటింగ్ కేంద్రాలతోపాటు జిల్లా కేంద్రాల్లో అవసరమైన మేర అక్రిడిటేషన్ కార్డులను జారీచేయాలని వారు ఆయనకు విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జర్నలిస్టులకు కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలనీ, జర్నలిస్టుల తరపున కంట్రిబ్యూషన్ ప్రభుత్వం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని టీడబ్ల్యూజేఎఫ్ నేతలు కోరారు. మహిళా జర్నలిస్టులకు రాత్రిపూట రవాణా సౌకర్యం కల్పించాలనీ, పనిచేసే ప్రదేశాల్లో లైంగిక నిరోధక కమిటీలు వేయాలని కోరారు. రిటైరైన జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు విజ్ఞప్తి చేశారు.
కేంద్ర కార్మిక చట్టాలను రద్దుచేసిన నేపథ్యంలో వేజ్ బోర్డు పరిస్థితి అగమ్యగోచరంగా మారిందనీ, ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకమైందని వారు ముకుంద్ రెడ్డి ఎదుట తమ ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్ తరహాలో తెలంగాణాలో కూడా ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని టీడబ్ల్యూజేఎఫ్ నేతలు సూచించారు. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలు సరిపోవనీ, నిధులు పెంచి ఎక్కువ మంది జర్నలిస్టులకు ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. రాష్ట్రంలోని మీడియాలో నెలకొన్న పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేయడానికి మీడియా కమిషన్ వేయాలని ప్రత్యేక కమిషనర్‌కు ఫెడరేషన్ బృందం సూచించింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
Satyavathi Rathod | సత్యవతి రాథోడ్‌కు కేటీఆర్ బర్త్ డే విషెస్.. వీడియో
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

