ఫాదర్స్ డే సందర్భంగా ఉచిత ప్రయాణం
5 ఏండ్లలోపు పిల్లలతో కలిసి తల్లిదండ్రులకు అవకాశం
ఆర్డినరీ నుంచి ఏసీ బస్సు వరకు ఫ్రీ
సుల్తాన్‌బజార్, జూన్ 18 : ఫాదర్స్ డేను పురస్కరించుకొని ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఐదేండ్లలోపు పిల్లలతో కలిసి తల్లిదండ్రులు అన్ని బస్సుల్లో ఆదివారం ఉచితంగా ప్రయాణం చేయవచ్చని హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తం నాయక్ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
పల్లె వెలుగు నుంచి ఏసీ సర్వీస్‌ల వరకు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించామన్నారు.