టిక్ టాక్‌కు బానిసైన భార్యతో విసిగిపోయి

అమీర్‌పేట్, జూలై 11 : ఓ కుటుంబంలో టిక్‌టాక్ వీడియో చిచ్చు పెట్టింది. టిక్‌టాక్ వీడియోలతో స్టార్ కావాలన్నది భార్య ఆలోచన. ఇది మంచిది కాదు.. అని నచ్చజెప్పినా వినని భార్య వైఖరితో విసిగిపోయిన భర్త తనువు చాలించాడు. బలవన్మరణానికి కారణమైన భార్యపై చర్యలు తీసుకోవాలంటూ మృతుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. సనత్‌నగర్ పీఎస్ పరిధిలోని శివశంకర్‌నగర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఈసీఐఎల్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం చేస్తున్న పవన్ నీమ్‌కర్ (36)కు ఆరేండ్ల కిందట మౌలాలికి చెందిన ప్రియాంకతో వివాహం జరిగింది. కొద్ది రోజులు బాగానే ఉన్నా.. ఆ తర్వాత వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అయితే, ఈ మధ్య కాలంలో ప్రియాంక టిక్‌టాక్ వీడియోలు చేస్తూ.. ఫాలోయింగ్ పెంచుకుంది. కొత్త పరిచయాలు ఏర్పడుతుండటంతో ఇద్దరి మధ్య గొడవలు మరింత పెరిగాయి. దీంతో ప్రియాంక తరుచూ పుట్టింటికి వెళ్లడంతో పవన్ మరింత ఇబ్బంది పడ్డాడు. భార్య వైఖరితో పూర్తిగా విసిగిపోయిన పవన్ రెండు రోజుల కిందట ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుమారుడి ఆత్మహత్యకు కారకురాలైన భార్య ప్రియాంకపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ మృతుడి తల్లి తారాబాయి బాలానగర్ డీసీపీకి ఫిర్యాదు చేసింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మద్దూరును కరువు మండలంగా ప్రకటించాలి.. మండల సభను బహిష్కరించిన సర్పంచులు
Eetha Trailer | ‘ఛావా’ దర్శకుడి కొత్త సినిమా.. శ్రద్ధా కపూర్ ‘ఈతా’ ట్రైలర్ విడుదల!
‘పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలి’
Europe | వాతావరణ మార్పులతోనే యూరప్‌లో ఎండలు.. 50వేల మరణాలకు అవే కారణం..
‘సీతారామ ప్రాజెక్టుతో సింగరేణి మండలానికి ఒరిగిందేమీ లేదు’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

