జూనియర్ ఆర్టిస్ట్‌కు బెదిరింపులు..
సినీ జూనియర్ ఆర్టిస్ట్ ఇంట్లోకి ప్రవేశించి.. బెదిరింపులకు పాల్పడిన యువకుడిపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ యాదగిరినగర్‌లో నివాసం ఉండే యువతి సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తుంది.
- యువకుడిపై కేసు నమోదు
వెంగళరావునగర్, జూన్ 30 : సినీ జూనియర్ ఆర్టిస్ట్ ఇంట్లోకి ప్రవేశించి.. బెదిరింపులకు పాల్పడిన యువకుడిపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ యాదగిరినగర్‌లో నివాసం ఉండే యువతి సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తుంది. యువతికి.. ఇంటి సమీపంలో ఉండే శివతో పరిచయం ఉన్నది. ఇద్దరు సన్నిహితంగా ఉన్న సమయంలో శివ.. ఫొటోలు, వీడియోలు తీశాడు. కాగా.. ఇటీవల వారిమధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి. దీంతో ఆమె.. అతడిని దూరం పెట్టింది. దీన్ని భరించలేక శివ..
ఆదివారం యువతి ఇంటికి వెళ్లి లోపల నుంచి తలుపు వేశాడు. ఆ సమయంలో ఆమెతో పాటు మరో ఇద్దరు రూమ్మేట్లు ఉన్నారు. యువతి మెడ పట్టుకుని, అసభ్యకర పదజాలంతో దూషించడంతోపాటు.. ఆమె రూమ్మెట్లను బెదిరించాడు. బయటకు రాకపోతే.. గతంలో తీసిన ఫొటోలను సోషల్ మీడియోలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. ఆమెను అక్కడి నుంచి బలవంతంగా యూసుఫ్‌గూడ బస్తీకి తీసుకెళ్లి,అక్కడ కూడా రోడ్డుపై దూషించి, అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

