క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో..కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విద్యార్థుల ప్రతిభ
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారని కేఎల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ జి.పార్థసారథి వర్మ అన్నారు.
జూబ్లీహిల్స్, అక్టోబర్4: c, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటారని కేఎల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ జి.పార్థసారథి వర్మ అన్నారు. అమెరికాకు చెందిన నూటానిక్స్ అనే అంతర్జాతీయ కంపెనీలో రూ.50.57 లక్షల వార్షిక జీతంతో కూడిన ఉద్యోగాలకు విజయవాడ క్యాంపస్ నుంచి నలుగురు, హైదరాబాద్ క్యాంపస్ నుంచి ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారని తెలిపారు. హైదరాబాద్‌లోని యూనివర్సిటీ కార్పొరేట్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ చదివి ఏడాది పూర్తిచేసుకున్న విద్యార్థులు ప్రాంగణ ఎంపికలో భాగంగా అంతర్జాతీయ కంపెనీ అయిన నూటానిక్స్ కంపెనీలో నిర్వహించిన ఎంపిక పరీక్షలో అర్హత పొంది రూ.50.57 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలను దక్కించుకోవడం హర్షణీయమన్నారు.
కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.రామకృష్ణ మాట్లాడుతూ.. విద్యార్థులకు వంద శాతం ఉద్యోగాలను అందించే లక్ష్యంతో తమ అధ్యాపకులు పనిచేస్తున్నారన్నారు. అడ్మిషన్స్ విభాగం డైరెక్టర్ జె.శ్రీనివాస రావు మాట్లాడుతూ.. ఎంతో స్నేహపూర్వకమైన వాతావరణంలో విద్యార్థులను ప్రపంచ స్థాయి నాయకులుగా తయారుచేయడమే కేఎల్ యూనివర్సిటీ ప్రధాన లక్ష్యమన్నారు. కేఎల్ హైదరాబాద్ బౌరంపేట క్యాంపస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రస్తుత పోటీ ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులకు నైపుణ్యాలతో కూడిన సంపూర్ణ సాంకేతిక విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగాలు పొందిన విద్యార్థినులు ఎం.సుజాత లక్ష్మి, రంగు ఉషశ్రీ, ఎం.జాహ్నావి లక్ష్మి, వి.శ్రావ్య చందన, హర్షిణి, హారిక, విద్యశ్రీలను, వారి తల్లిదండ్రులను యూనివర్సిటీ అధికారులు ఈ సందర్భంగా సన్మానించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- KL
- university students
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
Mouni Roy | గ్లామర్ డోస్ పెంచిన మౌనీ రాయ్.. రెడ్ డ్రెస్‌లో అందాల విందు!
King | ‘కింగ్’ ఓవర్సీస్ హక్కులు రూ.175 కోట్లు.. భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు!
మద్యం తాగేందుకు వెళ్లి.. విద్యుదాఘాతంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం’ జోరు.. 24 గంటల్లోనే 2.14 లక్షలకు పైగా టికెట్లు అమ్మకం!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

