జియాగూడలో ఆధునిక పశువధశాల
ఎట్టకేలకు జియాగూడలో ఆధునిక పశువధశాల నిర్మాణానికి అడుగులు పడ్డాయి.
- సుప్రీంకోర్టు ఆదేశాలతో కదిలిన జీహెచ్ఎంసీ
సిటీబ్యూరో, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఎట్టకేలకు జియాగూడలో ఆధునిక పశువధశాల నిర్మాణానికి అడుగులు పడ్డాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జియాగూడలో 11 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక హంగులతో ఎల్ఎస్ పద్ధతిలో కబేళాను నిర్మించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ఈ మేరకు రూ.42.50 కోట్ల అంచనా వ్యయంతో ఆధునిక పశువధశాల నిర్మాణానికి గానూ ఈనెల 9న టెండర్లు ఆహ్వానించింది. ఈ నెల 30న టెండర్ తుది గడువు విధించింది.
పశువధశాల నిర్మాణంతో పాటు అనుబంధంగా 100 కేఎల్డీ సామర్థ్యం గల వ్యర్థ జలాల శుద్ధి కేంద్రాన్ని (ఈటీపీ) ఏర్పాటు చేసి, ఐదేళ్ల పాటు కార్యకలాపాలు, నిర్వహణ బాధ్యతలను సదరు కాంట్రాక్టు సంస్థే స్వీకరించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. కాగా ఈ టెండర్లలో పాల్గొనే కాంట్రాక్టర్లకు స్పష్టమైన అనుభవ నియమాలను ఖరారు చేశారు. భవన నిర్మాణం, ఎలక్ట్రో-మెకానికల్ పనుల సరఫరా-కమిషనింగ్, ఈటీపీ ప్లాంట్ల నిర్వహణ, పశువధశాలల నిర్వహణలో సమగ్ర అనుభవం ఉండాలని, ప్రధాన సివిల్ కాంట్రాక్టర్ గరిష్టంగా ముగ్గురు అసోసియేట్లతో ఎంఓయూలు కుదుర్చుకుని టెండర్లలో పాల్గొనాలని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

