Pat Cummins | చంపాపేట, మే17: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ శుక్రవారం చంపాపేట డివిజన్ కర్మాన్‌ఘాట్‌లోని జిల్లా పరిషత్ పాఠశాలలో సందడి చేశారు. విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడి వారిని ఉత్తేజపరిచారు. పాఠశాలలో నిర్వహించిన బూట్ క్యాంపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన.. విద్యార్థులు భవిష్యత్‌లో నిర్వహించాల్సిన ప్రాజెక్టులను ఎలా తయారు చేసుకోవాలో తెలిపారు.
సైన్స్ పరికరాల వినియోగం, వాటి ప్రయోగ విధానం, శాస్త్రీయ దృక్పథంతో కొత్త పరికరాల తయారీ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో యూనిసెఫ్ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి శేషగిరి మధుసూదన్‌రావు, ఎస్పీడీ మల్లయ్య, జిల్లా విద్యాధికారి సుసేంద్రరావు, జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.