నేటి నుంచి ఇంటింటా జ్వర సర్వే
జూలై 25 నుంచి ఆగస్టు 15 వరకు మెదడు వాపు నిర్మూలన వ్యాక్సిన్ కార్యక్రమం ఉంటుందని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.
- ‘సీజినల్’ ప్రబలకుండా చర్యలు చేపట్టాలి
- కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ) : జూలై 25 నుంచి ఆగస్టు 15 వరకు మెదడు వాపు నిర్మూలన వ్యాక్సిన్ కార్యక్రమం ఉంటుందని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన జిల్లా టాస్క్‌ఫోర్స్ సమావేశంలో జపనీస్ ఎన్సెఫలిటీస్(జేఈ) వ్యాక్సిన్‌పై డీఈఓ, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ, వక్ఫ్‌బోర్డ్ అధికారులతో వ్యాధుల కట్టడిపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, మదర్సాల్లో మెదడు వాపు(జపనీస్ ఎన్సెఫలిటీస్) వ్యాధి నిర్మూలన టీకా వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టాలని సూచించారు.
ప్రతి శుక్రవారం అందరూ డ్రైడే నిర్వహించాలని చెప్పారు. పూలకుండీలు, ఫ్రిడ్జీలు, టైర్లు, కొబ్బరి బోండాలు తదితర వాటిలో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. డయేరియా, డెంగీ, చికెన్ గున్యా వంటి విష జ్వరాల బారిన పడకుండా విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆశా వర్కర్లు ఇంటింటికీ వెళ్లి ఓఆర్ఎస్, జింక్ ప్యాకెట్లు అందించాలని సూచించారు. గురువారం నుంచి ఇంటింటా జ్వర సర్వే జరుగుతున్నదని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ వెంకట్ తెలిపారు. అనంతరం డీఈఓ రోహిణి మాట్లాడుతూ.. విద్యార్థులకు, తల్లిదండ్రులకు వ్యాధులపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ శ్రీ కళ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

