Sri Rama Shobhayatra | మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కానున్న శ్రీరామనవమి శోభాయాత్ర
శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌లో ఏటా నిర్వహించే శోభాయాత్ర (Sri Rama Shobhayatra) మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఓల్డ్‌సిటీలోని సీతారాంబాగ్ (Seetharambag) రామాలయంలో స్వామివారి కల్యాణం జరుగుతున్నది.
హైదరాబాద్: శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌లో ఏటా నిర్వహించే శోభాయాత్ర (Sri Rama Shobhayatra) మరికొద్ది సేపట్లో ప్రారంభంకానుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఓల్డ్‌సిటీలోని సీతారాంబాగ్ (Seetharambag) రామాలయంలో స్వామివారి కల్యాణం జరుగుతున్నది. కల్యాణం అనంతరం స్వామివారి శోభాయాత్రను ఉత్సవ సమితి ఆరంభించనుంది. సీతారాంబాగ్ ఆలయం-బోయగూడ కమాన్ నుంచి మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ రోడ్డు, జాలి హనుమాన్, దూల్‌పేట, పురానాపూల్, జుమేరాత్ బజార్, చుడిబజార్, బేగంబజార్ చత్రి, బర్తన్ బజార్, సిద్దంబర్ బజార్ మసీదు, శంకర్ షేర్ హోటల్, గౌలిగూడ కమాన్, గురుద్వారా, పుత్లిబౌలి బౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా సుల్తాన్ బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాలకు యాత్ర చేరుకుంటుంది. మంగళ్‌హాట్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో ఆకాశ్‌పురి నుంచి మరో శాభాయాత్ర జరుగునుంది.
ఈ నేపథ్యంలో నగర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 15 వందల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. శోభాయాత్ర జరిగే మార్గంలో ఇప్పటికే బారికేడ్లు ఏర్పాటుచేశారు. శోభాయాత్ర మార్గంలో సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లతో ప్రత్యేక నిఘా ఉంచారు. సాయంత్రం 8 గంటల లోపు యాత్ర ముగించేలా ఏర్పాట్లు చేశారు. యాత్ర సాగుతున్నప్పుడు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. అందువల్ల వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

