ఆయన చెప్పిందే వేదం
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ)లో ఓ సీనియర్ అధికారి షాడో కమిషనర్‌గా చలామణి అవుతున్నాడా? నిర్వహణలో కీలకమైన విభాగంతో పాటు తనది ఏ మాత్రం సంబంధం లేని శాఖపై అధిపత్యం చలాయిస్తూ స్వలాభం కోసం కార్పొరేషన్ నిర్వహణ నిధులను, ఉద్యోగ నియమకాలను తన చేతుల్లోకి తీసుకుంటున్నాడా? క్యూర్ పరిధిలోని ఓ జిల్లాకు సంబంధించిన ఇన్చార్జి మంత్రి తాలుకా అని చెప్పుకొంటూ రోజూ రాత్రి వరకు ప్రధాన కార్యాలయంలోనే ఉంటూ వ్యవహారాలను చక్కదిద్దుతున్నాడా? అంటే ఉద్యోగ వర్గాలు అవుననే అంటున్నాయి.
- సీఎంసీలో షాడో కమిషనర్ !
- అడ్మిన్ విభాగం నిర్ణయాల్లో పెత్తనం
- ఉద్యోగుల నియామకంలో జోక్యం
- స్వచ్ఛ భారత్ మిషన్ పోస్టుల్లోనూ
- ఆయనకు నచ్చిన వారికే పోస్టింగ్‌లు
సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ)లో ఓ సీనియర్ అధికారి షాడో కమిషనర్‌గా చలామణి అవుతున్నాడా? నిర్వహణలో కీలకమైన విభాగంతో పాటు తనది ఏ మాత్రం సంబంధం లేని శాఖపై అధిపత్యం చలాయిస్తూ స్వలాభం కోసం కార్పొరేషన్ నిర్వహణ నిధులను, ఉద్యోగ నియమకాలను తన చేతుల్లోకి తీసుకుంటున్నాడా? క్యూర్ పరిధిలోని ఓ జిల్లాకు సంబంధించిన ఇన్చార్జి మంత్రి తాలుకా అని చెప్పుకొంటూ రోజూ రాత్రి వరకు ప్రధాన కార్యాలయంలోనే ఉంటూ వ్యవహారాలను చక్కదిద్దుతున్నాడా? అంటే ఉద్యోగ వర్గాలు అవుననే అంటున్నాయి. కొత్తగా ఏర్పడిన సీఎంసీకి అధికారికంగా కమిషనర్ ఉన్నప్పటికీ.. వెనుక ఉండి నడిపించే ఒక ‘షాడో కమిషనర్ ’గా ఇకడి పాలనా వ్యవహారాలను నడుపుతున్నట్లు అరోపణలు వస్తుండడం కార్పొరేషన్లో తీవ్ర కలకలం రేపుతోంది.
తనకు ఏ మాత్రం సంబంధం లేని అడ్మినిస్ట్రేషన్ విభాగాన్ని తన గుప్పిట్లో ఉంచుకున్న సదరు అధికారి, కార్పొరేషన్లో ఖాళీగా ఉన్న తాతాలిక (అవుట్ సోర్సింగ్/కాంట్రాక్ట్) ఉద్యోగాల భర్తీలో పారదర్శకతకు తూట్లు పొడుస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంత మనుషులకు, తనకు కావాల్సిన వర్గానికే ఉద్యోగాలు కట్టబెట్టేందుకు భారీగా పైరవీలకు తెరలేపినట్లు చర్చ జరుగుతున్నది. చివరకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్ మిషన్ పోస్టుల్లోనూ సదరు అదికారి తన మారు చూపించారని, అర్హతలతో సంబంధం లేకుండా, ఆయన చెప్పిన వారికే ఉద్యోగం వచ్చే పరిస్థితి దాపురించిందని పలువురు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. పైరవీలు చేసిన వారికే పోస్టింగ్‌లు దకుతుండటంతో అసలైన నిరుద్యోగులు, అర్హులైన అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారని, కమిషనర్ జోక్యం చేసుకుని ఇటీవల జరిగిన అంతర్గత ఖాళీ భర్తీలో భాగంగా కంప్యూటర్ ఆపరేటర్లు, శానిటరీ ఫీల్డ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఎఫ్ఏ నియామకాలపై పునర్ః పరిశీలించాలని బాధితులు కోరుతున్నారు.
రాత్రి దాకా వ్యవహారాలు
ప్రధాన కార్యాలయం తన నివాసానికి కూతవేటు దూరంలోనే ఉండటం సదరు షాడో అధికారికి బాగా కలిసివచ్చింది. అధికారిక వేళలు ముగిసిన తర్వాత కూడా రాత్రి పొద్దుపోయే వరకు ఆఫీసులోనే మకాం వేస్తున్నారు. అధికారులు, సిబ్బందిపై తన నిర్ణయాలను రుద్దుతూ, ‘నేను చెప్పిందే వేదం.. నేను గీసిందే గీత’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం సాగుతున్నది. విధి నిర్వహణ పేరుతో రాత్రి వేళల్లో సైతం కార్యాలయంలో ఉంటూ ఫైళ్లను తనకు అనుకూలంగా తిరగరాస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అంతేకాకుండా పారిశుద్ధ్య నిర్వహణలోనూ నిబంధనలను పకనబెట్టి ఓ ప్రముఖ కంపెనీకి అనుకూలంగా నెలవారీ నిర్ణయాలు తీసుకుంటూ లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు కార్పొరేషన్ వర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. ప్రధానంగా సదరు కంపెనీ ఎండీ తాలుకా మ్యారేజీ ఫంక్షన్లో సదరు అధికారి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడరని ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు. ఈ క్రమంలోనే కమిషనర్ తక్షణమే స్పందించి ఈ షాడో రాజ్యానికి చరమగీతం పాడాలని, నియామకాలు, చెత్త నిర్వహణ నిర్ణయాలను పారదర్శకంగా జరపాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

