కాలుష్యం కట్టడికి చర్యలేవీ?
మహానగరంలో కాలుష్య ముప్పును కట్టడి చేయాల్సిన ప్రభుత్వం అదనంగా మరో 20వేల కొత్త ఆటోలకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే.
- మరో 20వేల ఆటోలు రోడ్డెక్కేందుకు సిద్ధం
- ఇప్పటికే నగరంలో 1.40 లక్షల ఆటోలు
- తీవ్రంగా వేధిస్తున్న సీఎన్జీ కొరత
సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : మహానగరంలో కాలుష్య ముప్పును కట్టడి చేయాల్సిన ప్రభుత్వం అదనంగా మరో 20వేల కొత్త ఆటోలకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే కాలుష్యానికి సంబంధించి ఈవీలను ప్రోత్సహిస్తామని డాంబీకాలు పలికిన సర్కార్ వాటి కొనుగోలును ప్రోత్సహించకుండా పెట్రోల్, డీజిల్ ఆప్షన్‌తో కూడిన సీఎన్జీ, ఎల్పీజీల అమ్మకాలను డీలర్ల ద్వారా నడిపిస్తుండటంపై పర్యావరణ నిపుణుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే నగరంలో సీఎన్జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) గ్యాస్ కొరత తీవ్రంగా ఉందని బంక్‌ల నిర్వాహకులు చెబుతున్నారు. అదనంగా 20వేలు కొత్త ఆటోలు వస్తే పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పారు. ఇప్పటికే గ్రేటర్లో 1.40 లక్షల పెట్రోల్, డీజిల్ ఆటోలు ఉన్నాయి. పర్యావరణానికి హాని కలిగించే ఎటువంటి పెట్రోల్, డీజిల్, సీఎన్జీ(డీజిల్ ఆప్షన్) ఆటోలకు అనుమతివ్వద్దని నిపుణుల కమిటీ గతంలో తేల్చింది.
ఉన్నవాటికి పర్మిట్ రూపంలో కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు అదనంగా 20వేల ఆటోలు నగర రోడ్లపై రాకపోకలు సాగించనున్నాయి. దీంతో కాలుష్యం తీవ్రత పెరిగే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మారెట్లో పెట్రోల్, డీజిల్ బంకులతో పాటు ఆటో గ్యాస్, సీఎన్జీ, లిక్విడ్ గ్యాస్ కేంద్రాలు వేర్వేరుగా ఉన్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 460 పైగా పెట్రోల్ బంకులు ఉండగా, అందులో 95 స్టేషన్లలో గ్యాస్ పంపులు అందుబాటులో ఉన్నాయి. మరో 25 కేంద్రాలో నేచురల్ గ్యాస్ కేంద్రాలు కొనసాగుతున్నాయి. మహా నగరంలో వాహనాల సంఖ్య అక్షరాలా 86 లక్షలు దాటిపోయింది. అందులో 10.35 లక్షల వరకు కార్లు ఉండగా, 1.46 లక్షల ఆటోరిక్షాలు, 80 వేల క్యాబ్ లు ఉన్నట్లు అధికార లెకలు స్పష్టం చేస్తున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

