Salar Jung Museum | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని మూసీ నది ఒడ్డున ఉన్న సాలార్ జంగ్ మ్యూజియాన్ని మంగళవారం మూసివేయనున్నారు. ఉగాది పర్వదినం నేపథ్యంలో మ్యూజియాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాబట్టి పర్యాటకులు, సందర్శకులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
హైదరాబాద్ నగరంలో పాపులర్ టూరిస్ట్ ప్రదేశంగా సాలార్ జంగ్ మ్యూజియం ఉంది. మొత్తం మూడు బిల్డింగ్లలో మ్యూజియం విస్తరించి ఉంది. అందమైన కళాఖండాలు, శిల్పాలు, బొమ్మలు సందర్శకులను ఎంతో ఆకర్షిస్తాయి. ప్రపంచంలోని వివిధ నాగరికతల చరిత్ర, సంస్కృతి గురించి ఇవి తెలియజేస్తాయి. ప్రతిష్టాత్మక, పురాతమైన వస్తువులు, వివిధ కళాకృతులు, శిల్పాలు ఉండే సాలార్ జంగ్ మ్యూజియంకు ప్రతి రోజూ పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తూ ఉంటారు. వీకెండ్ సమయాల్లో సందర్శకుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది.