కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు రూ. 225 కోట్లు

హైదరాబాద్ : ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ మహానగరంలో నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)పనులు మరింత వేగవంతం కానున్నాయి. ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 225 కోట్ల నిధులను కేటాయించింది. ఈ ట్విన్ టవర్స్ హైదరాబాద్‌కు హైకాన్గా మారనున్నాయి. ప్రపంచస్థాయిలో అత్యాధునిక టెక్నాలజీతో ఈ భవనం నిర్మాణమవుతున్నది. ఇందులో కేవలం పోలీసు శాఖకే కాకుండా అన్ని ప్రభుత్వ విభాగాలు కూడా అత్యవసర పరిస్థితుల్లో ఈ భవనం నుంచే సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రజలకు సేవలందించనున్నారు. ట్రై పోలీస్ కమిషనరేట్లతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి సీసీ కెమెరాలను ఈ సీసీసీకి అనుసంధానం చేయనున్నారు. తాజా బడ్జెట్‌తో పాటు గత నాలుగేండ్లుగా సీసీసీ నిర్మాణం కోసం బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నాయి. తాజా బడ్జెట్‌తో పాటు గతంలో కేటాయింపులు కలుపుకుంటే ఇప్పటి వరకు సుమారు రూ. 750 కోట్ల కేటాయింపులు జరిగినట్లు అధికారు లు పేర్కొన్నారు. ఈ భవనాల నిర్మాణాలతో పాటు అత్యాధునిక టెక్నాలజీ కోసం ఈ నిధులను వెచ్చిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
NZvIND: టాస్ గెలిచిన ఇండియా.. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని దూసుకుపోతున్న ‘రణబాలి’.. బ్రేక్ఈవెన్ దిశగా అడుగులు!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

