రిఫ్రిజిరేటర్ కంప్రెషర్ పేలి ఇల్లు దగ్ధం
రిఫ్రిజిరేటర్ కంప్రెషర్ పేలి ఇల్లు దగ్ధమైంది. అయితే ఇంట్లో ఎవరూ లేక పోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
బండ్లగూడ, నవంబర్ 10 : రిఫ్రిజిరేటర్ కంప్రెషర్ పేలి ఇల్లు దగ్ధమైంది. అయితే ఇంట్లో ఎవరూ లేక పోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివసాయినగర్ కాలనీలో శ్రీకాంత్, కీర్తి దంపతులు నివాసం ఉంటున్నారు.
శ్రీకాంత్ సాఫ్ట్వేర్ ఉద్యోగి కాగా కీర్తి టీచర్‌గా పని చేస్తున్నారు. కాగా మంగళవారం ఉదయం వారిద్దరూ ఉద్యోగానికి వెళ్లారు. 10 గంటల సమయంలో ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థాని కులు శ్రీకాంత్‌కు, పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చేసరికి మంటలు చెలరేగాయి. ఇంట్లోని స్తువులన్నీ కాలిబూడిదయ్యాయి. పోలీసుల సమాచారంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా ఈ ఘటనపై ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

