dog missing | రూ.30 వేలు కావాలా? అయితే ఈ కుక్క ఆచూకీ కనుక్కో..

హిమాయత్‌నగర్ : ఇంట్లో పెద్దవాళ్లో, చిన్నపిల్లలో తప్పిపోతే వారి ఆచూకీ కోసం రివార్డు ప్రకటించడం మనకు తెలుసు. కానీ హైదరాబాద్ కు చెందిన ఒక కుటుంబం తప్పిపోయిన తమ కుక్కను వెతికిపెడితే రూ.30 వేలు ఇస్తామని ప్రకటించింది.ఖైరతాబాద్, చింతల బస్తీకి చెందిన టి.పుష్పప్రియ, టి.శేషావతరం లు కొంతకాలంగా ఒక కుక్కను పెంచుకుంటున్నారు. దాని పేరు డాలి.
ఈ మేరకు శుక్ర వారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జంతు వులంటే తమకు ఎంతో ఇష్టమని గత 12 ఏండ్ల నుంచి ఇండియన్ డాగ్(డాలి)ని పెంచుకుంటున్నామని తెలిపారు. ఫిబ్రవరి 7 న బయటకు వెళ్లిన తమ కుక్క తిరిగి ఇంటికి రాకపోవడంతో అప్పటి నుంచి ఆచూకి కోసం గాలిస్తున్నామన్నారు. గత 7 నెలల నుంచి కుక్క ఆచూకీ కోసం కరపత్రాలు, ప్లకార్డులు తయారు చేసి పంపిణీ చేయడం తో పాటు జీహెచ్ఎంసీ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.
కుక్కకు స్నానం చేయించిన తరువాత బెల్ట్ వేయడం మర్చిపోవడం వల్లే తప్పి పోయిందన్నారు. తెలుపు రంగులో ఉన్న తమ కుక్క(డాలి) ఆచూకీ తెలిసిన వారు 958 105 4010 నెంబర్‌కు సమాచారం అందించాలని, వారికి రూ.30 వేలు నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

