షాపింగ్ హంగామా.. బహుమతుల బొనాంజా
నమస్తే తెలంగాణ,తెలంగాణ టుడే దినపత్రికల ఆధ్వర్యం లక్కీడ్రా
కుత్బుల్లాపూర్,అక్టోబర్9: పండుగ వేళ షాపింగ్ ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తూ నమస్తే తెలంగాణ,తెలంగాణ టుడే దినపత్రికల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా షాపింగ్ బొనాంజా 2026 మూడో లక్కీ డ్రా కార్యక్రమాన్ని శుక్రవారం కొంపల్లిలోని వెంకాబ్ చికెన్ సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకాబ్ సంస్థ జనరల్ మేనేజర్ బాలసుబ్రమన్యన్, ఏజీఎం రాజిరెడ్డితో పాటు హోప్ అడ్వైర్టెజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కెఎస్ రావు, నమస్తే తెలంగాణ జీఎం సురేందర్‌రావు, ఏజీఎం రాజిరెడ్డి, మేనేజర్ ఎస్కే షాన్వాజ్లతో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొని లక్కీడ్రాను తీసి నలుగురు విజేతలను ఎంపిక చేశారు. టైటిల్ స్పాన్సర్ చెన్నై షాపింగ్‌మాల్, మెయిన్ స్పాన్సర్ సీఎంఆర్ షాపింగ్ మాల్, గిఫ్ట్ స్పాన్సర్ బిగ్-సీ, పవర్డ్ బై అల్మండ్ హౌస్, ప్రోటీన్ పార్ట్నర్గా వెంకాబ్ చికెన్‌తో పాటు హ్యుందాయ్, హర్ష టయోటా, వరుణ్మోటర్స్, చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, భారతి సిమెంట్స్, ఆంజనేయ జ్యువెల్లర్స్, వైష్ణవ్రాజ్ జ్యువెల్లర్స్, సుదర్శన్ ట్రావెల్స్, థ్రిల్ సిటీ, బ్యాంక్ ఆఫ్ బరోడా అసోషియేట్‌గా ఉన్నాయి.
విజేతల ఎంపిక..
కొంపల్లి వెంకాబ్ చికెన్ సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విజేతల లక్కీడ్రా సందడిగా జరిగింది. మొదటి విజేతగా వెంకటేశ్వర్లు టోకెన్ నంబర్ (కూపన్ నంబర్ 02094532), 32 ఇంచుల స్మార్ట్ టీవీ, రెండో విజేత రాకేశ్(కూపన్నంబర్ 012007) బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్, మూడో విజేత సుజాత (టోకెన్ నంబర్ 007072) గిప్ట్ ఓచర్, నాల్గో విజేత సాయి (కూపన్ నంబర్ 021912) గిఫ్ట్ ఓచర్లను కైవసం చేసుకున్నారు. ఈ నెల 14 తేదీ వరకు ప్రతిరోజూ వివిధ షాపింగ్ కేంద్రాల్లో దసరా బొనాంజా లక్కీ డ్రాలు నిర్వహించి విజేతలను ఎంపిక చేయనున్నారు.
కస్టమర్లకు బొనాంజా అదనపు బోనస్
నమస్తేతెలంగాణ, తెలంగాణ టుడే, టీ న్యూస్ యాజమాన్యానికి వెంకబ్ చికెన్ తరుపున శుభాకాంక్షలు. 11 సంవత్సరాలుగా ఈవెంట్‌ను ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ప్రజలకు షాపింగ్‌తో పాటు అదనపు బోనస్‌గా బహుమతులను అందించడం చాలా సంతోషకరం. దసరా పండుగ వేళ ఇది కస్టమర్లకు ఒక అదనపు పండుగ లాంటిది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న యాజమాన్యానికి, వెంకాబ్ సంస్థ కస్టమర్లకు, ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు
– బాలసుబ్రమన్యన్, వెంకాబ్ సంస్థ జనరల్ మేనేజర్
పారదర్శకత పాటించడం అభినందనీయం
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే 11 ఏండ్లుగా ఈ షాపింగ్ బొనాంజాను అద్భుతంగా నిర్వహిస్తున్నాయి. నేరుగా వారి ముందే డ్రా తీయడం ద్వారా పూర్తి పారదర్శకత పాటిస్తున్నారు. ఈ పారదర్శకత ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. విజేతలకు పాఠకులకు దసరా శుభాకాంక్షలు. దేవీ నవరాత్రుల తొమ్మిది రోజులు ప్రతి వాణిజ్య సముదాయం వద్ద ఈ డ్రాలు నిర్వహించి బహుమతులు అందించడం అభినందనీయం. ప్రజలందరూ షాపింగ్ చేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా.
– హోప్ అడ్వైర్టెజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కేఎస్ రావు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

