పురుగులు పట్టిన చాక్లెట్ల విక్రయం
పురుగులు పట్టిన చాక్లెట్లను విక్రయించిన షాపు నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాదాపూర్‌లో నివాసం ఉంటున్న డా.పెరూర్ పురేందర్‌రెడ్డి శనివారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నం.36లోని అఫ్‌జాన్ ఇంటర్నేషనల్ రిటైల్స్ సంస్థకు చెందిన అఫ్‌జాన్ డేట్స్ అండ్ నట్స్ షాపునకు వెళ్లారు.
- షాపు నిర్వాహకులపై కేసు నమోదు
బంజారాహిల్స్, జూలై 13: పురుగులు పట్టిన చాక్లెట్లను విక్రయించిన షాపు నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాదాపూర్‌లో నివాసం ఉంటున్న డా.పెరూర్ పురేందర్‌రెడ్డి శనివారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నం.36లోని అఫ్‌జాన్ ఇంటర్నేషనల్ రిటైల్స్ సంస్థకు చెందిన అఫ్‌జాన్ డేట్స్ అండ్ నట్స్ షాపునకు వెళ్లారు. అక్కడ కొన్ని ఆల్మండ్స్, కాజూ, డేట్స్‌తో పాటు డేట్స్‌తో తయారు చేసిన చాక్లెట్లను కొనుగోలు చేశారు.
ఇంటికి వెళ్లిన తర్వాత చాక్లెట్స్ బాక్సు తెరిచి చూడగా, వాటిలో తెల్లటి రంగులోని పురుగులు కనిపించాయి. దీంతో అఫ్‌జాన్ డేట్స్ అండ్ నట్స్ షాపునకు వెళ్లిన పురేందర్‌రెడ్డి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. అయితే సరైన సమాధానం ఇవ్వకపోవడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అఫ్‌జాన్ ఇంటర్నేషనల్ రిటైల్ లిమిటెడ్ సంస్థపై బీఎన్ఎస్ 125,274,275 సెక్షన్లతో పాటు 59 ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

